ఈ నెల టాలీవుడ్ కి పెద్దగా కలిసిరాలేదే!

లాక్ డౌన్ అనంతరం జనవరి నెలలో నాలుగు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వాటన్నింటిలో ‘క్రాక్’ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మిగిలినవేవీ అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో ఫిబ్రవరిలో రాబోయే సినిమాలపై టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ నెలలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. పైగా ప్రభుత్వం థియేటర్లకు నూరు శాతం ఆక్యుపెన్సీ ఇచ్చింది. ఫిబ్రవరి మొదటి వారం నుండే కనీసం మూడు, నాలుగు సినిమాలు విడుదల కావడం మొదలైంది. గత రెండు వారాల్లోనే పదిహేనుకి పైగా సినిమాలు విడుదలయ్యాయి.

వీటిలో ‘ఉప్పెన’ సినిమా మాత్రం హిట్ అయింది. కొత్త వాళ్లతో తీసినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తుంది. దాదాపు ఈ నెల మొత్తం ఈ సినిమా హవానే కొనసాగుతుంది. ఇదే నెలలో విడుదలైన అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది. చాలా కాలం తరువాత ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు నరేష్. నిర్మాతలకు భారీ లాభాలు రానప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. అలానే నాన్ థియేట్రికల్ రైట్స్ రేటు బాగా పలికింది.

ఇక ‘జాంబీరెడ్డి’ సినిమా ఓకే అనిపించుకుంది కానీ హిట్ ఖాతాలోకి వెళ్లలేకపోయింది. మొత్తానికి ఈ నెలలో టాలీవుడ్ కి కేవలం రెండు హిట్లు మాత్రమే దక్కాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన నితిన్ ‘చెక్’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాకి పోటీగా వచ్చిన ఏ సినిమా కూడా నిలదొక్కుకోలేకపోయింది. వచ్చే నెలలో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో క్రేజ్ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. కనీసం మార్చి నెలలోనైనా టాలీవుడ్ కి మరిన్ని హిట్స్ వస్తాయేమో చూడాలి!

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus