Adireddy, Revanth: కెప్టెన్సీ టాస్క్ లో ఆదిరెడ్డి – రేవంత్ ఫైట్..! కావాలనే ఇలా చేశాడా..?

బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ అనేది రసవత్తరంగా జరిగింది. ఒక జిమ్ బాల్ ఇచ్చి ఐదుగురు కెప్టెన్సీ పోటీదారులకి గోల్ పోస్ట్ లు ఇచ్చి , గోల్ అవ్వకుండా కాపాడుకోమని చెప్పాడు బిగ్ బాస్. బజర్ మోగగానే గేమ్ ఆడాలి. ఇక్కడే ఫస్ట్ రౌండ్ లో తెలివిగా ఆదిరెడ్డి తోసిన బాల్ కి రోహిత్ గోల్ పడింది. రోహిత్ గేమ్ నుంచీ అవుట్ అయ్యాడు. గేమ్ నుంచీ అవుట్ అయిన వాళ్లు సంచాలక్ గా మారాలి. ఆ తర్వాత రేవంత్ , శ్రీహాన్ ఇద్దరూ కలిసి ఆదిరెడ్డి కి స్కెచ్ వేశారు. రేవంత్ బాల్ కొడుతుంటే ఆదిరెడ్డిని శ్రీహాన్ గట్టిగా పట్టుకున్నాడు.

దీంతో ఆదిరెడ్డి గోల్ లో నుంచీ బాల్ ని పింపించాడు రేవంత్. అయితే, అది గాల్లోనుంచీ పంపిచావ్ అంటూ సంచాలక్ రోహిత్ చెప్పాడు. ఇక్కడ్కుంచీ ఆర్గ్యూమెంట్ మొదలైంది. కెప్టెన్సీ టాస్క్ లో హైడ్రామా మొదలైంది. నిజానికి ఒక గేమ్ లో రెండువైపుల పోల్స్ ఉన్నప్పుడు గోల్ ఎలా చేస్తారు. గాల్లోనుంచీ పోల్ హైట్ లో వెళ్లినా గోల్ కిందే లెక్క. అంటూ శ్రీహాన్, రేవంత్ వాదనకి దిగారు. ఇద్దరూ కలిసి ఎటాక్ చేస్తే డిపెండ్ చేస్కోవడం కష్టం. ఇద్దరూ కలిసి ఆడితే నేను ఆడలేను, ఇద్దరూ సపోర్ట్ తోనే ఆడారు అంటూ రెచ్చిపోయి వాదన చేశాడు ఆదిరెడ్డి.

నాతోనే స్ట్రాటజీస్ ఆడతారు అంటూ రెచ్చిపోయాడు. అయితే, రోహిత్ మాత్రం ఆదిరెడ్డిని ఆటలో మరోసారి ఎలౌ చేశాడు. చాలాసేపు గోల్ చేసేందుకు పార్టిసిపెంట్స్ నలుగురు ప్రయత్నించారు. దీంతో బిగ్ బాస్ ఈరౌండ్ లో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి ఏకాభిప్రాయంతో ఓట్ వేయండని చెప్పాడు. ఆదిరెడ్డి వెంటనే నేను రోహిత్ కి ఓటు వేస్తున్నా అని చెప్పాడు. ఆదిరెడ్డి కంప్లీట్ గా తన పాయింట్ ని ప్రూవ్ చేయాలని, వాళ్లు ఆడింది అన్ పెయిర్ అని అనిపించాలని గట్టి వాదన చేశాడు. గతవారం కెప్టెన్సీ టాస్క్ లో ఇనయా కూడా ఇదే విషయంలో ఆదిరెడ్డితో వాదించింది.

కానీ, మనోడు ఏహే పో… వెళ్లు, బాత్రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకోవడం కాదు ఆట అంటే, నువ్వు అలా గేమ్ ఆడేదానివి నాకు చెప్తున్నావ్ అన్నట్లు తీసిపారేశాడు. లాస్ట్ టైమ్ ఆదిరెడ్డి చేసింది కూడా ఇదే. కలిసి గేమ్ ఆడాడు. కానీ ఒప్పుకోలేదు. ఫైమాని రోహిత్ ఎటాక్ చేస్తుంటే ఆదిరెడ్డి వచ్చాడు. మరి అప్పుడు ఇద్దర్నీ డిపెండ్ చేయడం అనేది రోహిత్ కూడా కష్టమే. ఇక్కడ కూడా అదే జరిగింది. కర్మ అంటే ఇదే బ్రదర్.. తిరిగి వచ్చేస్తుంది. అలాగే రేవంత్ కి కూడా సంచాలక్ రోహిత్ రూపంలో కర్మ వచ్చేసింది.

గతవారం రేవంత్ సంచాలక్ చేసినపుడు రోహిత్ అనూహ్యంగా బలైపోయాడు. ఇన్ జస్టిస్ అని నామినేట్ కూడా చేశాడు. ఇప్పుడు కూడా అంతే, రేవంత్ మొత్తుకున్నా కూడా బౌన్స్ అయ్యి గోల్ వెళ్లాలంటూ ఆదిరెడ్డిని గేమ్ లో ఉంచాడు. తర్వాత ఏకాభిప్రాయంతో ఎలిమినేషన్ అప్పుడు కూడా ఆదిరెడ్డి శ్రీహాన్ తో, రేవంత్ తో వాదించాడు. నిజానికి గేమ్ లో నుంచీ వెళ్లడానికి ఆదిరెడ్డి ఇష్టపడలేదు. అందుకే, మీరిద్దరూ కలిసి ఆడారని ఒప్పుకోండి అని నాతోనే స్ట్రాటజీలా అంటూ మాట్లాడాడు. ఇక్కడ ఆదిరెడ్డి ఏకాభిప్రాయం అనే ఓటింగ్ లో శ్రీహాన్, ఇంకా రేవంత్ రెండు ఓట్లు వచ్చాయి కాబట్టి గేమ్ నుంచీ అవుట్ అయ్యాడు.

తర్వాత రేవంత్ ఇనాయాని అవుట్ చేశాడు. ఇనాయా చాలాసేపు పోరాడింది. అయితే, గేమ్ లో అవుట్ అయ్యాక ఇనాయా బాగా ఫీల్ అయ్యింది. ఈ కెప్టెన్సీ టాస్క్ లో చూసినట్లయితే, ఫస్ట్ రోహిత్ అవుట్ అయ్యాడు. తను గేమ్ ని ముందుకు తీస్కుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇనాయాకి బాల్ వేయబోతుంటే ఆదిరెడ్డి రోహిత్ గోల్ లో వేసేశాడు. తర్వాత ఆదిరెడ్డి హై డ్రామాతో ఎలిమినేట్ అయ్యాడు. అలాగే, రేవంత్ ఇనాయాని గోల్ చేసి తీసేశాడు. తర్వాత శ్రీహాన్ ని కూడా గేల్ చేసి లేపేశాడు. కెప్టెన్ అయ్యాడు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus