చిరంజీవి- నాగార్జున ఆ హీరోయిన్ కోసం ఎందుకు గొడవ పడ్డారో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు..!

టాలీవుడ్ లో సమకాలీన అగ్ర హీరోలు అయ్యుండి కూడా, ప్రాణ స్నేహితులు లాగ కలిసి మెలిసి ఉండే వారిలో ప్రధానంగా మనం చిరంజీవి, నాగార్జున గురించి చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో నుండే నాగార్జున చిరంజీవి ని ఎంతో గౌరవించేవారు. షూటింగ్స్ లేని సమయాల్లో చిరంజీవి నాగార్జున ఇంటికి వెళ్లడం, నాగార్జున చిరంజీవి ఇంటికి వచ్చి కాసేపు సరదాగా గడపడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఒకానొక దశలో వీళిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ పోరు నువ్వా నేనా అనే రేంజ్ లో కొనసాగింది. వీళిద్దరిలో ఎవరు గొప్ప అని ఒకప్పుడు పొలింగ్స్ కూడా నడిచేవి.

అంతటి పోటీ వాతావరణం లో కూడా వీళ్లిద్దరు ఎంతో స్నేహం గా కనిపించేవారు. ఇద్దరు కలిసి అప్పట్లో స్టార్ మా ఛానల్ ని కూడా కొనుగోలు చేసారు. కొన్ని రోజులు విజయవంతంగా నడిపి ఆ తర్వాత సోనీ టీవీ కి ఛానల్ ని అమ్మేసారు. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో చిరంజీవి – నాగార్జున ఒక పబ్లిక్ ఫంక్షన్ లో హీరోయిన్ కోసం గొడవ పడ్డారు. ఆ గొడవ సీరియస్ గొడవ అనుకుంటే పొరపాటే. సరదాగా కాసేపు చిన్నపిల్లలు లాగ గొడవ పడ్డారు,

అది కూడా రమ్య కృష్ణ విషయం లో. మన తెలుగు సినిమా చరిత్ర ఎన్నటికీ మర్చిపోని గొప్ప ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది ‘వజ్రోత్సవ వేడుకలు’ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా ఇండస్ట్రీ ప్రారంభమై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఈవెంట్ ని జరిపించారు. ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రతీ ఒక్కరు హాజరయ్యారు. ఒకరోజు యాంకర్ సుమ చిరంజీవి నాగార్జున మధ్యలో కూర్చున్న రమ్యకృష్ణ వద్దకి వెళ్లి, మీరు చిరంజీవి గారితో , నాగార్జున గారితో ఎన్నో సినిమాల్లో నటించారు కదా, వాళ్ళిద్దరితో ఎవరంటే మీకు బాగా ఇష్టం అని అడుగుతుంది.

అప్పుడు చిరంజీవి నేనే అని వస్తాడు, నాగార్జున కూడా కాదు నేనే ఎక్కువ ఇష్టం అని వస్తాడు. నాతో ఎక్కువ సినిమాలు చేసింది అని నాగార్జున అనగా, నాతో చాలా గొప్ప సినిమాలు చేసింది అంటూ చిరంజీవి సమాధానం ఇస్తాడు. అలా వాళ్లిద్దరూ సరదాగా గొడవ పడడం చూసి నాకోసం ఇద్దరు సూపర్ స్టార్స్ గొడవపడుతున్నారు, ఇంతకు మించి కావాల్సింది ఏముంది అటు జవాబు ఇస్తుంది. ఆ వీడియో ని మీరు కూడా క్రింద చూడొచ్చు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus