Bigg Boss 8 Telugu: యష్మీ, విష్ణుప్రియ… ఓ లక్షా యాభై వేల టాస్క్.!

‘బిగ్ బాస్ సీజన్ 8’ (Bigg Boss 8 Telugu) 2వ వారంలోనే గొడవలు పీక్స్ కి చేరుకున్నాయి. ఏ టాస్క్ ఇచ్చినా హౌస్మేట్స్ మధ్య గొడవ చోటు చేసుకుంటూనే ఉంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో లక్షా యాభై వేల రూపాయల టాస్క్ ఒకటి ఇచ్చినట్టు ఉన్నాడు బిగ్ బాస్. దీంతో ఆ ప్రైజ్ మనీ ఎలాగైనా గెలవాలని హౌస్మేట్స్ గట్టిగా ప్రయత్నించారు. చేతులు వణికితే ఈ గేమ్లో అవుట్ అన్నట్టు ఒక రూల్ కూడా పెట్టాడు.

Bigg Boss 8 Telugu

ఇన్ఫినిటీ మనీ గెలవాలంటే మాత్రం టైం కోసం వెయిట్ చేయాలనే షరతు పెట్టిన బిగ్ బాస్..గెలిచిన వారి ఖాతాల్లో మనీ వేశాడు. ఆ తర్వాత టాస్క్ లో విష్ణు ప్రియ (Vishnu Priya) , అటు తర్వాత పృథ్వీ (Prithviraj) , నిఖిల్ (Nikhil) ..లు గెలిచినట్టు ఓ ప్రోమో వదిలారు. ఇప్పుడు లక్షా యాభై వేల ప్రైజ్ మనీ టాస్క్ ఇచ్చారు. దీన్ని గెలవాలంటే ఆరెంజ్ జ్యూస్ ను గ్లాస్ లో నిండుగా పోయాలి. ఒక్క చుక్క కిందపడినా ఆ ప్రైజ్ మనీ గెలుచుకునే ఛాన్స్ మిస్ అయినట్టే.!

ఈ టాస్క్ లో అభయ్ నవీన్ (Abhay Naveen) , ఆదిత్య, నిఖిల్ పార్టిసిపేట్ చేసినట్టు ఉన్నారు. వాళ్ళు జ్యూస్ ను గ్లాస్ లో పోస్తున్నట్టు ప్రోమోలో చూపించారు. వాళ్ళ చేతులు కూడా వణికినట్టు స్పష్టమవుతుంది.మరి వీళ్ళలో ఎవరైనా గెలిచారా లేదా అనేది ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. అలాగే మరో యాభై వేల టాస్క్ ఇచ్చి అందులో భాగంగా పృథ్వీ, నిఖిల్, నబిల్ (Nabeel Afridi ) వ్యాక్స్ చేయించుకోవాలని బిగ్ బాస్ చెప్పినట్లు తెలుస్తుంది.

ఇక కిచెన్లో ‘మా చికెన్ మీరు తీసుకున్నారు’ అంటూ విష్ణు ప్రియ,’నీ దగ్గర ప్రూఫ్ ఉందా ? ఎవరు చెప్పారు మేము తీసుకున్నామని?’ అంటూ గొడవపడటం చూపించారు. మరి వీరి గొడవ చివరికి ఏమైందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ చూడాలి.

బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టిన టాస్క్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus