శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా ‘సింగిల్’ (#Single) అనే సినిమా రూపొందింది. దాని ట్రైలర్ ఇటీవల రిలీజ్ అవ్వడం.. అది హాట్ టాపిక్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అందులో కామెడీతో పాటు కొందరు సెలబ్రిటీల పై సెటైర్లు కూడా ఉన్నాయి. ‘యానిమల్’ (Animal) నుండి బాలకృష్ణ (Balakrishna) వరకు చాలా మంది స్టార్స్ పై సెటైర్లు ఉన్నాయి. కానీ అందరిలో ఎక్కువగా మంచు విష్ణు (Manchu Vishnu) హర్ట్ అయినట్టు ఇండస్ట్రీలో టాక్ నడించింది. తన ‘కన్నప్ప'(Kannappa) టీజర్లోని ‘శివయ్యా’ అనే డైలాగ్ ను అలాగే ‘మంచు కురిసిపోవడం’ వంటి డైలాగులు తమ ఫ్యామిలీని కించపరిచే విధంగా ఉన్నాయని..
విష్ణు హర్ట్ అయినట్లు తెలుస్తుంది. దీనికి సింగిల్ టీం వెంటనే రియాక్ట్ అయ్యి సారి చెప్పి.. ఆ డైలాగులు సినిమాలో ఉండవని స్పష్టం చేసింది. అలాగే లేటెస్ట్ ఇంటర్వ్యూలో.. ‘నేను ఎవరినీ నొప్పించాలని అనుకోను. అయితే నా కంటెంట్ వల్ల ఒకరు ఇబ్బంది పడ్డారు అని తెలిసింది కాబట్టి, దాన్ని సాగదీయకుండా వెంటనే రియాక్ట్ అయ్యి క్షమాపణలు చెప్పాలనిపించింది. చెప్పాను. అక్కడితో అంతా సద్దుమణిగింది అనుకుంటున్నాను’ అంటూ శ్రీవిష్ణు తెలిపాడు.
అయితే కొందరు ఇండస్ట్రీ పెద్దలు… ‘మంచు విష్ణు హర్ట్ అవ్వడంలో తప్పు లేదు’ అంటున్నారు. ఎందుకంటే ‘ఇండస్ట్రీ అంతా ఒక్కటే అనే భావన అందరికీ ఉండాలని, సోషల్ మీడియాలో కంటెంట్ ను నవ్వించడానికి వాడుకుంటే తప్పులేదని, కానీ ఒకరిపై ఇంకొకరు సెటైర్లు వేసుకునేలా ఇండస్ట్రీ జనాలు ఉంటే … పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిన తెలుగు సినిమాకి మంచిది కాదని’ ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు.