2020 సంవత్సరం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి. లెజెంట్స్, సెలబ్రిటీలు, స్టార్స్ ఒక్కొక్కరూ చనిపోతూ షాక్ ఇచ్చారు. కరోనా కారణంగా సగం సంవత్సరం లాక్ డౌన్ లో గడిచిపోతే, ఈ లౌక్ డౌన్ టైమ్ లోనే సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త బాలీవుడ్ ని మాత్రమే కాదు, యావత్ సినీ లవర్స్ అందరినీ దిగ్భాంతికి గురిచేసింది.
ఒకవైపు ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మానసికంగా కృంగిపోయి తన నివాసంలో బాంద్రాలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ బాలీవుడ్ యంగ్ హీరో. మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు, మార్కెట్ ఉన్నప్పుడు ఇలా చేసుకోవడం బాలీవుడ్ లో కలకలం రేపింది. అంతేకాదు, ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. జూన్ 14వ తేదిన సుశాంత్ చనిపోయిన తర్వాత తన ఆఖరి సినిమా దిల్ బేచారా ఓటీటీలో రిలీజైంది.
అంతకుముందు ఏప్రిల్ 29వ తేదిన నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త బాలీవుడ్ ని షేక్ చేసింది. ఎప్పట్నుంచో క్యాన్సర్ తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ తన తల్లిచనిపోయిన తర్వాత చనిపోవడం బాలీవుడ్ ప్రేక్షకుల్లో విషాదాన్ని నింపింది. తెలుగులో మహేష్ బాబుతో కలిసి సైనికుడు సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించిన ఇర్ఫాన్ ఖాన్ ఆఖరిగా అంగ్రేజీ మీడియం అనే సినిమాలో నటించాడు.
ఇర్ఫాన్ ఖాన్ మరణించిన వెంటనే రిషికపూర్ మరణం కూడా బాలీవుడ్ ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. లెజెండ్ యాక్టర్ గా రిషికపూర్ సినీలవర్స్ అందరికీ సుపరిచితుడే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో సినిమాల్లో తన మార్క్ ని చూపించారు రిషికపూర్. కొన్నేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతూ శ్వాసకోస సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. రిషికపూర్ మరణవార్త కపూర్ ఫ్యామిలీని కలచివేసింది.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25వ తేదిన కన్నుమూశారు. బాలుకి కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఎంతోమంది అభిమానులు ప్రత్యేకమైన పూజలు కూడా చేశారు. తండ్రి ఆరోగ్యం కోసం ఎస్పీ చరణ్ ప్రత్యేకంగా ఆయుష్ హోమాన్ని సైతం నిర్వహించారు. కానీ, కరోనాతో పోరాడుతూ చెన్నైలో బాలూ కన్నుమూశారు. తన గాత్రంతో అందరి మనుసులు దోచిన బాలూ అందరినీ వదిలి శాశ్వతంగా శివైక్యం చెందారు. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన బాలు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిదనే చెప్పాలి.
తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షనిజానికి విలన్ గా పేరు సంపాదించుకున్న జయప్రకాష్ రెడ్డి సెప్టెంబర్ 8వ తేదిన కన్నుమూశారు. రాయలసీమ యాసలో తనదైన స్టైల్లో కమెడియన్ గా, నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన మార్క్ ని వేశారు జయప్రకాష్ రెడ్డి. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బాత్రూమ్ లోనే తుది శ్వాస విడిచారు. జయప్రకాష్ మరణవార్త తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపిందనే చెప్పాలి. ప్రేమించుకుందాం రా , సమరసింహారెడ్డి సినిమాలు జయప్రకాష్ రెడ్డికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
ఇదే సంవత్సరం బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్, హాస్య నటుడు జగదీప్, కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా,