ఫిల్మ్‌ఫేర్‌ హిందీ నామినేషన్లు వచ్చేశాయ్‌… మనకు తెలిసిన సినిమాలు ఎన్నంటే?

  • January 17, 2024 / 10:46 AM IST

సినిమాలకు సంబంధించి ప్రైవేటు అవార్డుల్లో ప్రతిష్ఠాత్మకమైనవి అంటే ఫిల్మ్‌ ఫేర్‌ అని చెప్పొచ్చు. తొలుత హిందీలో మాత్రమే ఇచ్చిన ఈ పురస్కారాలు ఆ తర్వాత సౌత్‌కి కూడా వచ్చాయి. ఈ ఏడాదికి సంబంధించి 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్‌లో ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అవార్డుల కోసం పోటీపడుతున్న సినిమాల జాబితాను ఫిల్మ్‌ ఫేర్‌ విడుదల చేసింది.

అందులో చూస్తే ఓ సెలబ్రిటీ కపుల్‌ హవానే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే వాళ్లిద్దరూ కలిపి నటించిన సినిమాలు కాదు. ఇద్దరూ వేర్వేరుగా నటించిన సినిమాలు బరిలో నిలిచాయి. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ సినిమా అత్యధికంగా 20 కేటగిరీల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. అలాగే తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’ 19 విభాగాల్లో నామినేషన్స్‌లో (Filmfare) నిలిచంది.

పురస్కారాల నామినేషన్ల చూస్తే… ఉత్తమ చిత్రం (పాపులర్‌) విభాగంలో ‘12th ఫెయిల్‌’, ‘జవాన్‌’, ‘ఓఎంజీ 2’, ‘పఠాన్‌’, ‘రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ నిలిచాయి. ఉత్తమ చిత్రం క్రిటిక్స్‌ విభాగంలో ‘12th ఫెయిల్‌’, ‘బీడ్‌’, ‘ఫరాజ్‌’, ‘జొరామ్‌’, ‘శ్యామ్‌ బహదూర్‌’, ‘త్రీ ఆఫ్‌ అజ్’, ‘జ్విగాటో’ ఉన్నాయి. ఉత్తమ దర్శకుడు అవార్డు కోసం అమిత్‌ రాయ్‌ (ఓఎంజీ2), అట్లీ (జవాన్‌), కరణ్‌ జోహార్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ), సందీప్‌ రెడ్డి వంగా (యానిమల్‌), సిద్ధార్థ్‌ ఆనంద్‌ (పఠాన్‌), విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉన్నారు.

ఉత్తమ నటుడు అవార్డు బరిలో రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌), రణ్‌వీర్‌ సింగ్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ), షారుఖ్‌ ఖాన్‌ (డంకీ), షారుఖ్‌ ఖాన్‌ (జవాన్‌), సన్నీ డియోల్‌ (గదర్‌ 2), విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌) పోటీపడుతున్నారు. ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) విభాగంలో అభిషేక్‌ బచ్చన్‌ (ఘూమర్‌), జయ్‌దీప్‌ అహల్వత్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌), మనోజ్‌ బాజ్‌పాయ్‌ (జొరామ్‌) పంకజ్‌ త్రిపాఠి (ఓఎంజీ 2), రాజ్‌కుమార్‌ రావ్‌ (బీడ్‌), విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌), విక్రాంత్‌ మెస్సే (12th ఫెయిల్‌) నిలిచారు.

అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ), భూమి పెడ్నేకర్‌ (థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌), దీపిక పదుకొణె (పఠాన్‌) కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ), రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), తాప్సీ (డంకీ) ఉత్తమ నటి అవార్డు కోసం బరిలో నిలిచారు. అదే క్రిటిక్స్‌ విభాగంలో అయితే దీప్తి నవల్‌ (గోల్డ్‌ ఫిష్‌), ఫాతిమా సనా షేక్‌ (ధక్‌ ధక్‌), రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), సయామీ ఖేర్‌ (ఘూమర్‌), షహానా గోస్వామి (జ్విగాటో), షఫిల్‌ షా (త్రీ ఆఫ్ అజ్‌) ఉన్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus