సినీ ఇండస్ట్రీ ఎవరికి ఎప్పుడు వరాలిస్తుందో ఎవ్వరికీ తెలీదు. దాదాపు ఇక్కడ రాణించేవారంతా స్టార్ ఫ్యామిలీ నుండీ వచ్చిన వాళ్ళే.. అని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే సక్సెస్ కచ్చితంగా అవసరం. దాంతో పాటు ప్రేక్షకులను ఆకర్షించగలగాలి. ఇప్పుడు చెప్పిన రెండు వెంటనే లభిస్తాయి అని చెప్పలేము. రవితేజ లాంటి హీరో క్రేజ్ సంపాదించుకోవడానికి 20ఏళ్ళ సమయం పట్టింది. దానినే అద్భుతం అనుకుంటే.. ఈ ఏడాది ఇద్దరు నటులు.. అదీ పెన్షన్ తీసుకునే వయసులో పాపులారిటీ సంపాదించుకున్నారు. దానిని మరింత అద్భుతం అనుకోవాలి.
వివరాల్లోకి వెళితే..ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ తండ్రిగా నటించిన గోపరాజు రమణకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. సినిమాకి మెయిన్ హైలెట్ అని చెప్పుకోవాలి అంటే మొదట ఈయన పాత్రే అని చెప్పాలి. 60ఏళ్ళ వయసుకు దగ్గరగా ఉన్న గోపరాజు రమణ.. నిజానికి చాలా కాలం నుండీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇంద్రగంటి డైరెక్షన్లో వచ్చిన ‘గ్రహణం’ ‘అష్టా చమ్మా’ ‘గోల్కొండ హైస్కూల్’ వంటి చిత్రాల్లో ఇతను నటించాడు. అంతకు ముందు పలు సీరియల్స్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసాడు. అయితే నటుడుగా క్రేజ్ ను సంపాదించుకోవడానికి 12ఏళ్ళ సమయం పట్టింది.అయితే ఇప్పుడు ఈ నటుడికి వరుస ఆఫర్లు వస్తున్నాయట.
ఇక ఇదే ఏడాది వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ లో ‘రమణా..లోడ్ ఎత్తాలిరా’ అనే ఒక్క డైలాగ్ తో బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు కుమనన్ సేతురామన్. ఇతని వయసు కూడా 60ఏళ్ళ పైనే..! ఇతను చిరంజీవికి మంచి స్నేహితుడు. అలాగే ఆయన స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీకి కూడా పనిచేసాడు. 20ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉంటూ వస్తున్న కుమనన్ కు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.ఆ సినిమా దయ వల్ల ఇతనికి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని వినికిడి.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?