Sudigali Sudheer: త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సుడిగాలి సుధీర్!

సుడిగాలి సుధీర్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇప్పుడు వెండితెర ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెర పై ఇతనికి స్టార్ ఫాలోయింగ్ ఉంది. ఓ మెజీషియన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్ ‘జబర్దస్త్’ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి, అటు తర్వాత టీం లీడ్ అయ్యి .. తర్వాత బుల్లితెర పై చాలా షోలకి హోస్ట్ గా కూడా వ్యవహరించాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీతో ఇతను డేటింగ్ లో ఉన్నట్టు ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.

ఈ జంట(Sudigali Sudheer) కూడా అవును అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని అప్పట్లో కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ అందులో నిజం లేదు అంటూ వీళ్ళు తోసిపుచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మరోపక్క రష్మీకి పెళ్లైపోయింది కానీ ఆమె చెప్పుకోవడం లేదు అనే టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఇదిలా ఉండగా.. సుధీర్ పెళ్లి సంగతి ఏంటి? అనే ప్రశ్న లాక్ డౌన్ ముందు నుండి ఉంది. మూడు పదుల వయసు దాటినా సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

లాక్ డౌన్ టైంలో ఇతనికి సంబంధాలు చూస్తున్నట్టు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళు అలా చెప్పి మూడేళ్లు కావస్తున్నా ఇంకా సుధీర్ పెళ్లి చేసుకుంది లేదు. అయితే మళ్ళీ సుధీర్ పెళ్లి గురించి మళ్ళీ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ షికారు చేస్తుంది. అదేంటి అంటే.. అతనికి మరదలు వరస అయ్యే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సుధీర్ రెడీ అయ్యాడట. తన తల్లిదండ్రుల కోరిక మేరకు సుధీర్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus