Balakrishna, Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ బాలకృష్ణ దర్శకత్వంలోనే…!

  • June 11, 2021 / 09:31 AM IST

టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్‌ చర్చల్లో మోక్షజ్ఞ తెరంగేట్రం ఒకటి. చాలా ఏళ్లుగా దీని గురించి పుకార్లు వస్తున్నాయి, పోతున్నాయి. వార్తలు వచ్చేలా కనిపిస్తున్నాయి.. ఆగిపోతున్నాయి. అయితే వాటికి తెరదించుతూ, అభిమానుల ఉత్సాహాన్ని పెంచుతూ నందమూరి బాలకృష్ణ అదిరిపోయే అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. మోక్షజ్ఞ తెరంగేట్ర చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని ప్రకటించారు. బాలకృష్ణ సినిమాల్లో కలికితురాయిగా నిలిచిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్‌ తీస్తా అని బాలయ్య చాలా రోజులు నుండి చెబుతూనే ఉన్నారు.

అయితే వివిధ కారణాల వల్ల ఆ పని అవ్వడం లేదు. అయితే తనకు ఎంతో ఇష్టమైన ఆ సినిమాను తన కొడుకు మోక్షజ్ఞతో తీయబోతున్నారట. అదే మోక్షజ్ఞ తొలి సినిమా కూడా. ఈ సినిమాకు కథం చేసుకొని, తనే దర్శకత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు బాలయ్య. ముందు చెప్పుకున్నట్లే మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ గురించి చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. దానికి చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్‌ అంటూ ప్రముఖ దర్శకుల పేర్లు చక్కర్లు కొట్టాయి. కానీ బాలయ్య అనౌన్స్‌మెంట్‌తో అవన్నీ పటాపంచలు అయిపోయాయి.

దీంతో బాలయ్య దర్శకత్వంలో మోక్షజ్ఞ వస్తున్నాడని తెలిసి అభిమానులు ఆనందపడిపోతున్నారు. అంతా ఓకే కానీ… తెలుగు దర్శకుల మీద బాలయ్య నమ్మకం లేదా? లేక తనలాగే తన కొడుకు సినిమా కూడా తండ్రి దర్శకత్వంలోనే వస్తే బాగుంటుందని అనుకున్నారా? అనేది తెలియడం లేదు. ఎందుకంటే బాలకృష్ణ ‘తాతమ్మ కల’ అనే సినిమాలో ఇండస్ట్రీలోకి వచ్చారు. దానికి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. దీంతో ఆ సెంటిమెంట్‌ పాటిస్తున్నారా? లేక తనకు ఎంతో ఇష్టమైన ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ ‘ఆదిత్య 963’ (గతంలో ఈ పేరే వార్తల్లోకి వచ్చింది) కొడుకు చేసినా ఓకే అనుకున్నారా.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus