Venu: పేరు పలకబడి వచ్చిన జబర్దస్త్ మానేయడానికి ప్రధాన కారణం అదే!

బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమానికి ఉన్నటువంటి క్రేజ్ గురించి మనకు తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీగా ఉండిపోయారు. ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో కమెడియన్ వేణు ఒకరు. ఈయన వేణు వండర్స్ టీం ద్వారా ఎంతో అద్భుతమైన స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు ప్రస్తుతం డైరెక్టర్ గా మారిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన డైరెక్టర్ గా తెరకెక్కించిన మొదటి చిత్రం బలగం.కమెడియన్ ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వేణులో ఇంత టాలెంట్ దాగి ఉండి ఇన్నాళ్లు అవకాశం లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక బలగం సినిమా మంచి సక్సెస్ కావడంతో దిల్ రాజు వేణుకి మరొక అవకాశం కూడా ఇచ్చారని సమాచారం.ఇలా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ జబర్దస్త్ కార్యక్రమం తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలను డబ్బును కూడా తెచ్చి పెట్టింది. ఇలా తనకు మంచి స్థాయిని ఇచ్చినటువంటి జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడానికి మల్లెమాల వారితో ఉన్న మనస్పర్ధలు అస్సలు కారణం కాదని తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని తెలిపారు. తనకు సినిమాలలో కొనసాగడమే తన కల,సినిమాలపై ఉన్న పిచ్చితోనే తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశానని అందుకే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వచ్చానని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus