NTR : ఇకపై జూ. ఎన్టీఆర్ పేరు వాడితే.. చట్టమే సమాధానం చెబుతుంది !
- January 29, 2026 / 01:59 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకు మారు మోగిన జూనియర్ ఎన్ఠీఆర్ పేరు ఇక న్యాయబద్ధంగా మరింత బలంగా మారింది. ‘యంగ్ టైగర్’, ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నజూ.ఎన్ఠీఆర్ పేరు, రూపం, గుర్తింపును అనుమతి లేకుండా వాడితే గట్టిగా చర్యలు ఉంటాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
NTR
నందమూరి తారక రామారావు జూనియర్, ఈ పేరు కేవలం ఓ నటుడి గుర్తింపు మాత్రమే కాదు, అది ఒక బ్రాండ్. ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరకూ సాగిన ప్రయాణంలో తన నటన, డాన్స్, డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక అభిమానుల్ని పొందగలిగారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన పేరు, ఫోటోలు, మార్ఫ్ చేసిన చిత్రాలు, AI-కంటెంట్‌లను ఉపయోగించి అనధికారికంగా వస్తువుల విక్రయాలు, డిజిటల్ కంటెంట్ తయారీ, ట్రోలింగ్ వంటి అనవసర కార్యకలాపాలు పెరిగాయి. ఇవన్నీ తన గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మారడంతో జూనియర్ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు, ఆయనకు సెలబ్రిటీ హోదా ఉందని ప్రాథమికంగా గుర్తిస్తూ, “NTR”, “Jr. NTR”, “యంగ్ టైగర్”, “మ్యాన్ ఆఫ్ మాసెస్” వంటి పేర్లు, అలాగే ఆయన రూపం వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా వాడకూడదని ఆదేశించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇటువంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాల్సిందే. ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్‌కే కాదు, డిజిటల్ యుగంలో సెలబ్రిటీల గౌరవాన్ని కాపాడే కీలక తీర్పు.











