‘బాహుబలి చిత్రం తరువాత ప్రపంచ సినిమా బాక్సాఫీస్ ఒక్కసారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం వైపుకి మళ్ళిన విషయం తెలిసిందే.. ఇండియాలో మెట్టమెదటిగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజి తో తెరెకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 15 న భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకి నిర్మాతలు సన్నాహలు చేశారు. బాహుబలి లాంటి చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటం తో రెబల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా పై భారి అంచనాలు పెట్టుకున్నారు. దీంతో మేకర్స్ ఎక్కడా చిన్న విషయం లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాలని నిర్ణయించుకున్నారు. హైస్టాండర్డ్ వి ఎఫ్ ఎక్స్ ని యూజ్ చేయటం వలన హడావుడి కాకుండా ప్రపంచవ్యాప్తంగా వున్న సినిమా లవర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబందించిన వర్క్ జరుగుతుంది. అందుకే ఇండిపెండెన్స్ డే లాంటి మంచి డేట్ ని కూడా మేకర్స్ వదులుకుని ఆగష్టు 30న ఈ చిత్రాన్ని అందింస్తున్నారు. పూర్తి క్రిస్టల్ క్లారిటి గా రెబర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఈ సాహో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సందర్బంగా నిర్మాతలు వంశి-ప్రమెద్-విక్రమ్ లు మాట్లాడుతూ.. మా బ్యానర్ లో వచ్చిన అన్ని చిత్రాలు క్వాలిటి కి కేరాఫ్ గా వచ్చాయి. మరి ఇప్పుడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా సాహో లాంటి చిత్రాన్ని చేస్తున్నాము అది కూడా బాహుబలి అనే ల్యాండ్ మార్క్ చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటం సినిమా ప్రేక్షకులందరూ అంచనాలు అందుకోవాలి అందుకే చిన్న విషయం లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము.. వి ఎఫ్ ఎక్స్ కూడా అదే రేంజి లో వుండేలా కేర్ తీసుకుంటున్నాము. ఇంత లార్జ్ స్కేల్ వస్తున్న చిత్రాన్ని ప్రేక్షకులకి బెస్ట్ గా ఇవ్వాలన్న మా ప్రయత్నం కొంచెం ఆలస్యమైనా బెస్ట్ ఇచ్చి తీరాలని నిర్ణయించుకున్నాం.. ఆగష్థు 30న ఈ చిత్రాన్ని ప్రపంచం లో వున్న సినిమా లవర్స్ కి అందిస్తున్నాము.. అని అన్నారు
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు.. రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీషరఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు..