దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వలన వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 7న పక్కా సినిమా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. ప్రమోషన్స్ అన్నీ కూడా జోరుగా నిర్వహించారు. కానీ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. దీంతో అభిమానులు నిరాశ పడ్డారు. కానీ పెరుగుతున్న కరోనా కేసులు, నార్త్ లో కొన్ని ఏరియాల్లో లాక్ డౌన్, ఏపీ టికెట్ రేట్ ఇష్యూ అన్నీ దృష్టిలో పెట్టుకొని సినిమాను వాయిదా వేశారు.
రీసెంట్ గా కొత్త రిలీజ్ డేట్లను ప్రకటించారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ రెండు డేట్లలో కూడా సినిమా రావడం లేదని తెలుస్తోంది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రబృందం. మార్చి 25న సినిమా రాబోతుందని.. ఇదే ఫైనల్ డేట్ అంటూ ప్రకటించారు. ఈ మార్పుకి కారణాలు తెలియదు కానీ ఈసారి మాత్రం సినిమా రావడం పక్కా అని తెలుస్తోంది.
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ డేట్ ను ఫిక్స్ చేశారు కాబట్టి మిగిలిన సినిమాల డేట్లు కూడా ఒక్కొక్కటిగా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ‘రాధేశ్యామ్’, ‘భీమ్లానాయక్’ ఇలా అన్ని సినిమాల రిలీజ్ డేట్లు మారుతాయని తెలుస్తోంది. వచ్చే మూడు నెలల్లో భారీ సినిమాలు మాత్రం రావడం ఖాయమని తెలుస్తోంది. దాదాపు రూ.600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు.
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితరులు నటించారు.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!