Uday Kiran: ఉదయ్ నమ్మకం ఈ మూవీతో నిజమవుతుందా..?

  • June 4, 2021 / 05:17 PM IST

చిత్రం సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా తరువాత ఉదయ్ కిరణ్ నటించిన నువ్వునేను, మనసంతా నువ్వే, శ్రీరామ్ సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే ఒకదశలో ఉదయ్ కిరణ్ వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఉదయ్ కిరణ్ మరణం గురించి వేర్వేరు కారణాలు వినిపించినా వరుస ఫ్లాపుల వల్లే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.

అయితే ఉదయ్ కిరణ్ చివరగా నటించిన చిత్రం చెప్పిన కథ సినిమా కొన్ని కారణాల వల్ల థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఉదయ్ చనిపోయిన రెండు నెలలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా వేర్వేరు కారణాల వల్ల థియేట్రికల్ రిలీజ్ ఆగిపోయిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాలో మదల్సా శర్మ హీరోయిన్ గా నటించారు. ఓటీటీ సంస్థల నుంచి నిర్మాతలకు ఈ సినిమా బడ్జెట్ కంటే రెండు రెట్లు ఎక్కువ మొత్తం ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.

ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు తన సన్నిహితులతో ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పారని సమాచారం. ఉదయ్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా హీరో తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎదురైన సంఘటనలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఉదయ్ చివరి సినిమా కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా చూస్తారని ఓటీటీ సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఏడు సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా కావడంతో ఈ సినిమా ఇప్పటి ప్రేక్షకులకు నచ్చుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus