‘చిత్రం’ ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు ఉదయ్ కిరణ్. ఎటువంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా… స్టార్ గా ఎదిగాడు ఉదయ్ కిరణ్. కానీ ఏమైందో ఏమో తరువాత అతని జీవితం తలక్రిందులు అయిపోయింది.అతను చేసిన సినిమాలు కూడా హిట్లు కాలేదు. కొత్త సినిమా అవకాశాలు కూడా కరువయ్యాయి. కొన్నాళ్ళకు ఇతని ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవ్వడంతో.. ప్రాణాలు తీసుకున్నాడు.
2014 లో ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. 6 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ విషాదాన్ని మర్చిపోలేదు ప్రేక్షకులు. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సంఘటన కూడా ఉదయ్ కిరణ్ ను మరోసారి గుర్తుచేసేలా చేసింది. ఇదిలా ఉండగా.. ఉదయ్ కిరణ్ నటించిన ఆఖరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’ ను ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో సినిమాలను బాగా చూస్తున్నారు.
మొన్నటికి మొన్న కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ ను కూడా ఓటిటిలో విడుదల చెయ్యగా.. దానికి కూడా మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు ‘నెపోటిజం’ అనే టాపిక్ కూడా ట్రెండింగ్ లో ఉండటం వల్ల .. ‘ఉదయ్ కిరణ్ ఆఖరి సినిమాని కచ్చితంగా చూస్తారు’ అని ఆ చిత్రం దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చెయ్యడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.