‘మీలో ఎవరు కట్టప్ప’ ముగిసిపోయింది!

‘మీలో ఓ కట్టప్ప ఉన్నాడంటూ..’ తొలి ఎపిసోడ్‌లోనే మొదలుపెట్టాడు బిగ్‌బాస్‌. జాగ్రత్త సుమా అంటూ… ఒకటికి రెండుసార్లు రకరకాల స్కిట్లు పెట్టాడు. మీరే చెప్పండి అంటూ టాస్క్‌లు కూడా పెట్టాడు. ‘ఇదేందబ్బా బిగ్‌బాస్‌ ఇంత సాగదీస్తున్నాడు’ అందరూ విసుక్కున్నారు. ఇంత అవసరమా అంటూ మీమ్స్‌ కూడా ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. వీకెండ్‌లో అసలు కట్టప్ప ఎవరో చెప్పేస్తారు అనుకుంటున్న సమయంలో ప్రోమోలో ‘చెప్పేద్దాం’ అనేసరికి ఏం చెబుతారా అనుకున్నారు.

బోర్‌గా నడిచిన కట్టప్ప స్కిట్‌కు నాగ్‌ బంపర్‌ హిట్‌ క్లైమాక్స్‌ ఇచ్చాడు. స్టాంపుల టాస్క్‌లో పడిన ఓట్ల ఆధారంగా లాస్య (4) , సూర్యకిరణ్‌ (3), నోయల్‌ (3), అమ్మ రాజశేఖర్‌ (3), అఖిల్‌ (1)ను నిలబెట్టారు. వీరిలో ఎవరిని ‘కట్టప్ప’ చేస్తారు అని మరోసారి నాగ్‌ అడిగాడు. ఆరు ఓట్లతో లాస్యను కట్టప్పగా ఇంట్లో వాళ్లు ఫిక్స్‌ చేశారు. అయితే ఇక ఆమెనే కట్టప్ప అనుకుంటున్న సమయంలో నాగ్‌ ట్విస్ట్‌ చేశాడు. అసలు ఇంట్లో కట్టప్పనే లేడని… మీలో ఉన్న అనుమానమే కట్టప్ప అని తేల్చేశాడు. మరి లాస్యను ఏం చేశారనేగా… వెరైటీగా ఈ వారానికి ఇంటి కెప్టెన్‌ని చేశారు. అలా లాస్య బిగ్‌బాస్‌ 4లో తొలి కెప్టెన్‌గా ఎంపికైంది.

బాగుంది కదా లాస్ట్‌ ట్విస్ట్‌. అయితే దీనికి కొంతమంది నెటిజన్లు ముందే ఊహించి ట్విటర్‌లో మీమ్స్‌ కూడా చేసేశారు. కనెక్షన్‌ పెంచుకోండి అని బిగ్‌బాస్‌ చెబితే ఎవరూ ముందుకు రాలేదు కానీ… అనుమానించమంటే మాత్రం ముందుకొచ్చారు అంటూ నాగ్‌ చెప్పాడు. చూద్దాం ఈ వారం అయినా… అనుమానాలు మాని కనెక్షన్లు కలుపుకుంటారామో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus