FIR Collections: సోలో రిలీజ్ అయ్యుంటే బాగుండేది..ఇప్పుడైతే డిజాస్టరే !

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు విశాల్…’రాట్ససన్’ చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మొదటిసారి అతను ‘ఎఫ్.ఐ.ఆర్’ అనే డార్క్ యాక్షన్ థ్రిల్లర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని… ‘విష్ణు విశాల్ స్టూడియోస్’ బ్యానర్ పై స్వయంగా హీరో విష్ణు విశాలే నిర్మించగా తెలుగులో మాత్రం మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌కుడిగా వ్యవహరించాడు. ‘అభిషేక్ పిక్చ‌ర్స్’ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది.

Click Here To Watch

ఫిబ్రవరి 11న విడుదలైన ఈ చిత్రానికి పర్వాలేదు అనిపించే టాక్ నమోదైంది. దాంతో ఓ పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ నమోదయాయ్యి.కానీ వీకెండ్ తర్వాత ఈ చిత్రం బాగా డ్రాప్ అయ్యింది. ఇక రెండో వారం పూర్తిగా ఈ చిత్రాన్ని తొలగించి ‘డిజె టిల్లు’ ని ప్రదర్శిస్తున్నారు. దాంతో ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసినట్టు అయ్యింది.

ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం  0.23 cr
సీడెడ్  0.16 cr
ఆంధ్రా(టోటల్)  0.26 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.65 cr

‘ఎఫ్.ఐ.ఆర్’ మూవీకి తెలుగులో రూ.1.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. విష్ణు విశాల్ సినిమా తెలుగులో డబ్ అవ్వడం ఇదే మొదటిసారి. రానా నటించిన ‘అరణ్య’ సినిమాలో ఇతను కీ రోల్ పోషించినప్పటికీ అది జనాలకి అంతగా రిజిస్టర్ కాలేదు.అయితే ‘ఎఫ్.ఐ.ఆర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.1.50 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.65 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇవి మంచి కలెక్షన్లే కానీ కొంచెం ఎక్కువ రేట్లకి తెలుగులో విక్రయించడంతో ‘ఎఫ్.ఐ.ఆర్’ ను డిజాస్టర్ గా పరిగణించాలి. ఓటిటి రైట్స్ పరంగా తెలుగు బయ్యర్ సేవ్ అవ్వడం ఊపిరి పీల్చుకునే అంశం.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus