‘పుష్ప 2’ తో పాటు మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు!

ఒక సినిమాకి ఓపెనింగ్స్ అనేవి చాలా ముఖ్యం. మొదటి రోజు, మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసింది అనే దానిపైనే ఆ సినిమా (Movies) ఫుల్ రన్ బాక్సాఫీస్ పరిస్థితి, బయ్యర్స్ సేఫ్ అవుతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. పైగా బడ్జెట్ కనుక ఎక్కువైతే మన దర్శక, నిర్మాతలు దాన్ని మొత్తం వెనక్కి రాబట్టడానికి టికెట్ రేట్లు వంటివి భారీగా పెంచడానికి రెడీ అయిపోతున్నారు. దాని ద్వారా మొదటి వీకెండ్ 80 శాతం రికవరీ చేసుకోవాలనేది వారి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు వరల్డ్ వైడ్ గా సాధ్యమైనంత వరకు ఎక్కువ థియేటర్లలో విడుదల చేసుకుంటున్నారు.

Movies

ఒకప్పటిలా ఇప్పుడు వచ్చే సినిమాలకి లాంగ్ రన్ ఉంటుంది అనేది చెప్పలేం. అలాగే భారీ ఓపెనింగ్స్ కి కూడా సరైన రిలీజ్ డేట్ అనేది దక్కించుకోవడం చాలా ముఖ్యంగా. ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకునే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి.. తెలుగులో మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఏంటో.. టాప్ 10 లిస్ట్ లో ఏమున్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) పుష్ప 2 :

అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar)  కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప 2′(ది రూల్) (Pushpa 2: The Rule)  చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.247 గ్రాస్(అన్ని భాషలు కలుపుకుని) కోట్ల భారీ వసూళ్లు సాధించి నెంబర్ వన్ ప్లేస్లో నిలిచింది.

2) ఆర్.ఆర్.ఆర్  (RRR) :

ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) హీరోలుగా నటించిన ఈ సినిమాకి రాజమౌళి  (S. S. Rajamouli)  దర్శకుడు. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.236 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

3) బాహుబలి 2 (Baahubali 2) :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  ,  దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.209 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది.

4) కల్కి 2898 ad (Kalki 2898 AD)  :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) , దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)  కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.185 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5) సలార్(పార్ట్ 1 : సీజ్ ఫైర్) (Salaar) :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.158 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

6) దేవర(మొదటి భాగం) (Devara) :

ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్లో రూపొందిన ‘దేవర’ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.156 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7) ఆదిపురుష్ (Adipurush)  :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.137 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.

8) సాహో (Sahoo) :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డులు కొట్టింది.

9) గుంటూరు కారం (Guntur Kaaram) :

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్  (Trivikram) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.87 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

10) సైరా నరసింహారెడ్డి (Sye Raa Narasimha Reddy) :

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా సురేందర్ రెడ్డి  (Surender Reddy)దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.84 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

11) సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) :

మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల(బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా (Movies) మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus