‘ఆస్కార్’ రేసుకు మీరు పంపకపోతే ఏంటి.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వెళ్తుంది అని అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే మన దేశం తరఫు నుండి అధికారికంగా వెళ్లకపోయినా.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ఆస్కార్ బరిలో నిలిపే ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ క్రమంలో తొలి అడుగు కూడా పడిందట. హాలీవుడ్ మీడియా ప్రకారం అయతే.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ఆస్కార్ కోసం కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ వెళ్లిందట. వివిధ విభాగాల్లో సినిమా పోటీ పడటానికి సిద్ధం చేశారట.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాను నేరుగా ఆస్కార్ నామినేషన్స్‌కు పంపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు For Your Consideration (FYC) అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. థియేటర్లలో ఆడిన సినిమాలను ఆస్కార్స్‌కు కన్సిడర్ చేయడానికి పంపమని ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ కోరింది. దీంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ క్యాంపెయిన్ మొదలైందట. ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (ఎన్టీఆర్, రామ్ చరణ్), ఉత్తమ సహాయ నటుడు (అజయ్ దేవగణ్), ఉత్తమ సహాయ నటి (ఆలియా భట్), ఉత్తమ సంగీత దర్శకుడు (ఒరిజినల్ స్కోర్) విభాగాల్లో సినిమా పోటీకి సిద్ధమైంది.
వీటితోపాటు సౌండ్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా 15 విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఆస్కార్ పురస్కారాల కోసం కన్సిడర్ చేయాలంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అయితే ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి. ‘‘ఆర్‌ఆర్‌ర్’కు ప్రపంచం నలుమూలల నుండి ప్రేమ దక్కుతుండటం ఒక కలలా ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతోందో అని ఆసక్తిగా వేచి చూస్తున్నాం’’ ఎస్.ఎస్. కార్తికేయ ట్వీట్ చేశారు.
మరోవైపు ఆస్కార్ విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ముడిపెట్టి మరో చర్చ జరుగుతోంది. RRR For Oscars క్యాంపెయిన్ మొదలైన నేపథ్యంలో హాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ రుస్ ఫిషర్ ఓ ట్వీట్ చేశారు. ‘బెస్ట్ పిక్చర్ నామినీలను స్టేజి మీద నిలబెట్టి ‘నాటు నాటు…’ పాటకు స్టెప్పులు వేయమని చెప్పాలి. ఎరు డ్యాన్స్ చేస్తారో వాళ్లకు ఆస్కార్ ఇవ్వాలి’’ అని ట్వీట్ చేశారు. అయితే ఆ ఐడియా తనకు నచ్చిందని కార్తికేయ కామెంట్ కూడా చేశారు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!