Jr NTR: తారక్ అలాంటి వ్యక్తా.. నటుడి షాకింగ్ కామెంట్స్..?

దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎన్టీఆర్ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాకు, కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిటయ్యారు. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎమోషన్స్ ను అద్భుతంగా పండించగలరని తెలిపారు. ఎన్టీఆర్ షూటింగ్ లేని సమయంలో పాటలు పాడుతూ సరదాగా మాట్లాడేవారని ఫిష్ వెంకట్ అన్నారు.

ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని ఎంతోమందికి సహాయం చేశారని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చారు. డబ్బు రూపంలో కానీ మాట రూపంలో కానీ ఎన్టీఆర్ సహాయం చేశారని ఫిష్ వెంకట్ పేర్కొన్నారు. అయితే తను చేసిన సహాయాల గురించి బయటకు చెప్పడానికి ఎన్టీఆర్ పెద్దగా ఇష్టపడరని ఫిష్ వెంకట్ అన్నారు. 2005 సంవత్సరంలో తన సిస్టర్ మ్యారేజ్ ఉందని జూనియర్ ఎన్టీఆర్ ను పిలవడానికి వెళ్లి ఎన్టీఆర్ ను పెళ్లికి రావాలని కోరానని ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ కావడంతో చికాకులో ఉన్నారని ఫిష్ వెంకట్ అన్నారు.

అయితే ఇన్విటేషన్ ఇచ్చిన తరువాత 20,000 రూపాయలు ఇచ్చారని తను వద్దని చెప్పినా వినకుండా ఎన్టీఆర్ డబ్బులు ఇచ్చారని ఫిష్ వెంకట్ తెలిపారు. ఎన్టీఆర్ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని ఫిష్ వెంకట్ పేర్కొన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఫిష్ వెంకట్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకుంటున్నా ఎన్టీఆర్ మీడియాకు మాత్రం ఆ విషయాలను వెల్లడించకపోవడం గమనార్హం.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus