Rakul Preet: వరుసగా ఐదు ప్లాప్‌లు.. అయినా ఆఫర్లు తగ్గడం లేదు!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది రకుల్. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో ఆమె దశ తిరిగింది. వరుసపెట్టి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. హిట్టు మీద హిట్టు కొట్టడంతో స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా చాలా మందితో కలిసి ఆడిపాడింది. ఆ తరువాత ఆమె నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి.
అదే సమయంలో ఆమెకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి.

అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. ఈ ఏడాది ఏకంగా ఆమె నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఇందులో ఏదీ కూడా సరైన ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది. ‘రన్ వే 34’, ‘కట్ పుటిల్’, ‘ఎటాక్’, ‘డాక్టర్ జి’, ‘థ్యాంక్ గాడ్’ ఇలా రకుల్ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో ఒకట్రెండు సినిమాలకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం లేవు.

వీటిని ప్లాప్స్ కిందే లెక్కపెట్టాలి. వరుస ఐదు ప్లాప్ సినిమాలు పడినప్పటికీ.. రకుల్ కి అవకాశాలకు మాత్రం లోటు లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. మరో ఐదు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. హిందీలో ‘ఛత్రివాలి’, ‘మేరె పత్ని కా రీమేక్’, తమిళంలో శివకార్తికేయన్ ‘అయలాన్’, ‘ఇండియన్2’ అలానే ఓ బైలింగ్యువల్ సినిమాలు చేస్తోంది. వీటిలో కొన్ని సినిమాలు షూటింగ్స్ పూర్తి కాగా.. మిగిలిన సినిమాలు షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి.

మొత్తానికి రిజల్ట్ తో సంబంధం లేకుండా రకుల్ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఆమె.. వచ్చే ఏడాది ఎన్ని సినిమాలు చేయాలి..? ఎలాంటి సినిమాలు చేయాలనే విషయం మీద దృష్టి పెట్టినట్లు చెబుతోంది. రకరకాల పాత్రలు, బోలెడన్ని సినిమాలు చేయడం తప్ప తనకు మరో ధ్యాస లేదని చెబుతోంది రకుల్. వచ్చే ఏడాదిలోనైనా.. ఆమెకి సక్సెస్ వస్తుందేమో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus