ప్రజా కవి – గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ గారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారు. ఆయన మరణం ఊహించనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందాం. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో గద్దర్ (74) కన్నుమూత . 10 రోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన గద్దర్.
తన పాటలతో ప్రజాగాయకుడిగా గుర్తింపు పొందిన గద్దర్ ప్రజాయుద్ధనౌకగా పేరు తెచ్చుకున్న గాయకుడు. గద్దర్ కు భార్య, ముగ్గురు పిల్లలు. ఇయన 1949లో మెదక్ జిల్లా తుప్రాన్ లోని దళిత కుటుంబంలో జన్మించిచారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు .. గద్దర్ హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదివారు..గద్దర్.. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
గద్దర్ మాభూమి చిత్రంలో బండెనక బండికట్టి పాట పాడి నటించిన్నారు..ఈ పాట ఎప్పటికీ మర్చిపోలేనిది..సినిమాలు అనేక విప్లవ గేయాలు రాశారు.. 1997లో గద్దర్ పై హత్యాయత్నం చేశారు.. చాలాకాలం శరీరంలో తూటాతోనే జీవించారు.. తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఊపు తెచ్చారు. ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. విప్లవోద్యమాలకి తన పాటనిచ్చారు. ప్రజల పాటకి జోహార్. ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే.. అంటూ ప్రముఖులు స్పందించారు..