పవన్ కల్యాణ్ సినిమాకి, జానపద గీతానికి సూపర్ కనెక్షన్ ఉంటుంది. ఆయన గత సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ‘ఖుషీ’లో ‘బయ్ బయే బంగారు రమణమ్మ…’ కానీ ‘జానీ’లోని బిట్ సాంగ్స్‌కానీ, ‘పంజా’లోని పాపారాయుడు పాట కానీ, ‘అత్తారింటికి దారేది’లోని ‘కాటమరాయుడా…’ ఇలా అన్నీ దేనికదే భిన్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కంటే… పవన్ కొత్త సినిమాలో కూడా ఓ జానపద గీతం ఉండబోతోందట. అంతేకాదు ఆ పాట ఇప్పటికే సిద్ధమైపోయిందని కూడా తెలుస్తోంది.
మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కొషియమ్’ సినిమాను తెలుగులో ‘పవన్ కల్యాణ్ – రానా’ కాంబో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మలయాళ మాతృకలో యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్, ఎమోషన్స్ ఎంత బాగా పండాయో… ఓ నేపథ్య గీతం కూడా అంతే అదరగొట్టింది. ‘అడకచక్కో..’ అంటూ ఈ పాట సినిమాలో హైవోల్టేజీ సీన్స్ వచ్చినప్పుడల్లా వస్తుంది. ఆ పాట సినిమా మూడ్ బూస్ట్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. అంతటి పాట తెలుగులో కూడా పెట్టబోతున్నారనేది కొత్తగా చెప్పక్కర్లేదు.
సినిమా షూటింగ్‌లో ఇప్పటికే ఆ పాటను వాడుతున్నారట. పవన్ పాత సినిమాల స్టయిల్‌లో మాంచి మాస్ జానపద గీతాన్నే దీని కోసం వాడుతున్నారట. కచ్చితంగా మలయాళ పాటకు డబుల్ రేంజిలో ఇది ఉండబోతోందట. అయితే సినిమా ప్రీ టీజర్‌లో వినిపించిన ‘బిల్లా రంగా’ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌నే ఆ పాట అని కొందరు అంటున్నారు. వరుసగా మూడు టీజర్లలోనూ అదే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ వాడటం దీనికి కారణం. చూద్దాం త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో.
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!