బన్నీ కోసం అడవిని తెస్తున్న సుకుమార్‌ అండ్‌ కో.!

సినిమా కోసం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యే హీరోలు ఉంటారు. అలాగే అదే సినిమా ఎలాంటి సెట్‌నైనా సిద్ధం చేసే ఆర్ట్‌ టీమ్‌ కూడా ఉంటుంది. ఇప్పుడు రెండోది హైదరాబాద్‌లో జరగబోతోంది. అల్లు అర్జున్‌ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ గురించే ఇదంతా. సినిమా కోసం స్టయిలిష్‌ స్టార్‌ ‘రఫ్‌’ స్టార్‌గా మారిపోయి వావ్‌ అనిపించాడు. ఇప్పుడు అదే సినిమా కోసం సుకుమార్‌ అండ్‌ టీమ్‌ ఏకంగా హైదరాబాద్‌కు శేషాచలం అడవులను తీసుకొస్తున్నారట. ఇంకా ఏం చేస్తున్నారంటే…

‘పుష్ప’ కోసం సుకుమార్‌ చాలా పెద్ద ప్రయత్నాలే చేశాడు. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా శేషాచలం అడవుల్లోనో లేక ఆ తరహా అడవుల్లో చిత్రీకరణ జరపాలనుకున్నారు. అయితే కరోనా – లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఈలోగా మేకోవర్‌తో అల్లు అర్జున్‌ రెడీ అయిపోయాడు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాయనుకొని ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరణ ప్రారంభించారు. ఈ క్రమంలో చిత్రబృందంలో కొంతమందికి కరోనా సోకడంతో చిత్రీకరణ నిలిపేశారు. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణ ప్రారంభిస్తారట. అయితే ఈ సారి అడవులకు వెళ్లకుండా.. హైదరాబాద్‌కే అడవిని తీసుకొస్తున్నారట.

హైదరాబాద్‌ శివార్లలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో చిత్రీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం నుండే చిత్రీకరణ మొదలవనుంది. ఈసారి అవాంతరాలు ఎదురైనా, చిత్రీకరణ ఆగకూడదని చిత్రబృందం నిర్ణయించిదట. సినిమా కోసం వ్యవసాయ క్షేత్రాన్ని అడవిలా మార్చబోతున్నారట. దట్టమైన అడవిలా ఆ ప్రాంతాన్ని సిద్ధం చేసి చిత్రీకరణ జరపాలని సుకుమార్‌ అండ్‌ కో నిర్ణయించిందట. అయితే సెట్స్‌ విషయంలో సుకుమార్‌ తీసుకునే శ్రద్ధ మనకు తెలుసు కదా. ‘రంగ స్థలం’లో మనం ఇప్పటికే చూశాం. సో… ‘పుష్ప’తో మరోసారి అలాంటి వావ్‌ సెట్స్‌ చూడొచ్చన్నమాట.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus