ఈ మధ్యనే ‘కార్తికేయ2’ చిత్రం రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ మూవీని పారలెల్ గా రిలీజ్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు చెప్పినట్టు చాలా సరదాగా అక్కడ 60 థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కానీ ఊహించని విధంగా రెండో రోజు,మూడో రోజు, నాలుగో రోజు గ్రోత్ ను చూపిస్తూ ఇప్పటివరకు ఈ మూవీ అక్కడ రూ.2.7 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బడా హీరోల సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుండడం విశేషంగా చెప్పుకోవాలి. కృష్ణుడు, ద్వారక నేపథ్యం.. అనేది యూనివర్సెల్ కాన్సెప్ట్ కాబట్టి… ‘కార్తికేయ2’ ని హిందీ జనాలు బాగా ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ‘కార్తికేయ’ చిత్రాన్ని చూడకపోయినప్పటికీ ఈ మూవీ అక్కడ విజయకేతనం ఎగరేయడానికి కారణం అదే అని చెప్పాలి..!
ఇదిలా ఉండగా .. ‘కార్తికేయ’ లానే ‘అఖండ’ కూడా యూనివర్సల్ కాన్సెప్ట్ కదా..! మరి ఆ మూవీని ఎందుకు హిందీలో రిలీజ్ చేయలేదు అని పలువురు నందమూరి అభిమానులు నిరాశచెందుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ‘అఖండ’ టైంకి నార్త్ లో థియేటర్లు అంతంత మాత్రమే రన్ అవుతున్నాయి. పైగా ‘అఖండ’ హిందీ డబ్బింగ్ రైట్స్ కు భారీ రేటు పలికిందట.
ఒకవేళ ‘అఖండ’ ని హిందీలో రిలీజ్ చేస్తే.. అంత రేటు చెల్లించడం కుదరదు అని సదరు సంస్థ చెప్పిందట. అసలే ఆ టైంలో థియేటర్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. భారీ బిజినెస్ చేసిన సినిమాలు కూడా లేవు.డబ్బింగ్ రైట్స్ రూపంలో వచ్చే భారీ మొత్తాన్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేక ‘అఖండ’ మేకర్స్ హిందీ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ‘అఖండ’ నిజంగానే హిందీలో రిలీజ్ అయ్యి ఉంటే కనుక అక్కడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసుండేదేమో.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?