Kajal: పెళ్ళైన తర్వాత ఇలాంటి పాత్రలు చెయ్యాల్సిన అవసరం ఏమిటి అంటున్న నెటిజన్లు!

  • September 1, 2023 / 08:30 PM IST

సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కాజల్ అగర్వాల్ నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. ఈమెకి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా ఆమె యుక్త వయస్సులో ఉన్నప్పుడు అయితే ఆమె అందాలకు ముగ్దులు కానీ మనిషి అంటూ ఉండదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. పెళ్ళైన తర్వాత కూడా ఆమె అందం ఇసుమంత కూడా తగ్గలేదు.

ఇప్పుడు రీ ఎంట్రీ లో ఆమె వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తుంది. వీటితో పాటుగా సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె బాలయ్య బాబు హీరో గా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్న సమయం లోనే ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్ చేసింది.

ఇది లేడీ తమిళం లో తెరకెక్క్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఇందులో (Kajal) కాజల్ అగర్వాల్ బ్రోతల్ హౌస్ లో పని చేసే అమ్మాయిగా కనిపించబోతుంది. పెళ్లి చేసుకున్న మొగుడు పిల్లల్ని కనేసి మోసం చేసి వెళ్లిపోగా, కాజల్ అగర్వాల్ తన బిడ్డని పోషించుకునేందుకు ఏమి చెయ్యాలో తెలియక బ్రోతల్ హౌస్ లోకి వస్తుంది. ఆ తర్వాత ఆమె జీవితం లో జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ. ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ ఇలాంటి పాత్రలో ఎప్పుడూ నటించలేదు, మొట్టమొదటిసారి అలాంటి పాత్రలో కనిపించబోతుంది.

దీనిపై ఆమె అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాజల్ అగర్వాల్ పెళ్ళైన తర్వాత ఇలాంటి పాత్రలు చెయ్యాల్సిన అవసరం ఏమిటి..?, ఏ హీరోయిన్ కూడా పెళ్లి అయ్యాక ఇలాంటి పాత్రలు పోషించినట్టు చరిత్రలో లేదు, మొట్టమొదటిసారి కాజల్ అగర్వాల్ అలాంటి ప్రయోగం చేస్తుంది. మరి ఈ ప్రయోగం లో ఆమె సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus