గౌతమ్ అలా చెయ్యకపోతే పెళ్లికి నొ చెప్పేదాన్ని : కాజల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు మరియు ప్రముఖ బిజినెస్మెన్ అయిన గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అటు తరువాత ఈమె హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లి సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కాజల్ ఇంత సడెన్ గా పెళ్లి చేసుకుంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు. గతంలో ఈమె పెళ్లి గురించి చాలా రూమర్లు వచ్చాయి కానీ..

ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని జవాబివ్వడంతో.. అంతా ఆ వార్తలను నమ్మడం మానేశారు. ఇదిలా ఉండగా… గౌతమ్‌తో పెళ్లికి ఒప్పుకోవడం వెనుక ఓ కారణం కూడా ఉందని ఇటీవల కాజల్ తెలిపింది. ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ.. “అందరి అమ్మాయిల్లానే.. నాకు కాబోయే భర్త ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకునేదాన్ని. ముఖ్యంగా నాకు కాబోయే వాడు… మోకాళ్ల పై నిలబడి ఎర్రని గులాబి ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చెయ్యాలని కోరుకుకునేదాన్ని.! సరిగ్గా నేను కోరుకున్నట్టే… గౌతమ్ కిచ్లు నాకు ప్రపోజ్ చేశాడు.

అందుకే వెంటనే పెళ్లికి అంగీకరించాను. ఒకవేళ అలా గౌతమ్ అలా చెయ్యకపోతే ఇప్పట్లో పెళ్లి చేసుకునేదాన్ని కాదు(నవ్వుతూ). కానీ ప్రతి అమ్మాయికి ఈ కోరిక ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటా అని గౌతమ్.. ముందుగానే నా పేరెంట్స్ కు చెప్పాడు. అయినా సరే నాకోసం మోకాళ్ల పై నిలబడి ప్రపోజ్ చెయ్యాలని కండిషన్ పెట్టాను. ఓ మంచి లవ్ ఫీల్ తర్వాతే పెళ్లి చాలా మధురంగా అనిపిస్తుంది” అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5


6

7

8

9

10

11

12

13

14

15

16

17

more..

1

2

3

4

5

6

7

8

9

10

పెళ్లి ఫోటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36


Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus