గత వారం థియేటర్లలో రిలీజ్ అయిన ‘వాంటెడ్ పండు గాడ్’ ‘కమిట్మెంట్’ ‘తీస్ మార్ ఖాన్’ ‘అం అః’ ‘మాటరాని మౌనమిది’ వంటి సినిమాలు జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. దీంతో అంతకు ముందు వారం రిలీజ్ అయిన ‘సీతా రామం’ ‘బింబిసార’ ‘కార్తికేయ’ వంటి చిత్రాలే ప్రేక్షకులకు దిక్కయ్యాయి. ఈ వారం కూడా 4 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒక్క ‘లైగర్’ తప్ప జనాలను పెద్దగా ఆకర్షించిన సినిమాలు లేవనే చెప్పాలి. మరి ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) లైగర్ : విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీగా రూపొందిన చిత్రం ‘లైగర్’.సాలా క్రాస్ బ్రీడ్ అనేది క్యాప్షన్. ఆగస్టు 25న ఈ మూవీ విడుదలౌతుంది. మైక్ టైసన్ ఈ మూవీలో నటించడం విశేషం. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి నిర్మించిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.
2) కళాపురం : ‘పలాస 1978’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ రస్టిక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించటమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ ఈసారి కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అనేది క్యాప్షన్. ఆగస్టు 26న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.’జీ స్టూడియోస్’, ‘ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి..ఈ చిత్రాన్ని నిర్మించారు.సత్యం రాజేష్, చిత్రం శ్రీను, వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
3) భళా చోర భళా : ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ (స్వర్గీయ ఏవీఎస్‌గారి తనయుడు) దర్శకత్వం వహించగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మించారు. ఆగస్టు 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
4) పీకే(#PK) : అషు రెడ్డి,శ్రిత రావు నటించిన ఈ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కాబోతుంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?