షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన చిరు..!

ప్లాస్మా అనేది కరోనా బాధితుల పాలిట సంజీవని లాంటిది అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.శుక్రవారం రోజున గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో కరోనా నుండీ కోలుకుని ప్లాస్మా దానం చేసిన ప్రజలను సీపీ సజ్జనార్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యి కొన్ని షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “ప్లాస్మా దానం చేసే వాళ్ళు నిజంగా దేవుళ్ళతో సమానం.ఇప్పుడు అది సంజీవనిలా మారింది. నా ఇంట్లో పనిచేసే.. నలుగురు వర్కర్స్‌కి కరోనా వచ్చి.. రికవరీ అయ్యారు. 45 రోజుల క్రితం వాళ్లకి కరోనా వచ్చింది. రెండుసార్లు వాళ్ళకు నెగిటివ్ వచ్చిన తరువాతే తిరిగి పనిలో పెట్టుకున్నాం.

వంటపని చేసే శ్రీను, అతని కొడుకు.. స్మిమ్మింగ్ పూల్ క్లీన్ చేసే లక్ష్మణ్.. కాయకూరలు తరిగి వంటకి సాయం చేసే మరో మహిళకు కూడా కరోనా వచ్చింది. ఈమె తెచ్చిన కాయకూరల్ని క్లీన్ చేయడంలో అశ్రద్ధ వహించడంతో ఆమెకు కరోనా సోకింది. ఆమె వల్ల మిగిలిన వాళ్లకు కూడా కరోనా వచ్చింది. ఆ స్మిమ్మింగ్ పూల్ క్లీన్ చేసే అతను.. నేను కనిపిస్తే మాస్క్ పెట్టుకుంటాడు.. లేకపోతే లేదు. వాడు ఎక్కడ వేలు పెట్టాడో తెలియదు కాని.. వాడికి కూడా కరోనా వచ్చింది. అలాగే వంట మనిషి కొడుకు కూడా నాకేం వస్తుందిలే అనుకున్నాడు వాడికీ వచ్చింది.

మొదట వీళ్లంతా దగ్గు, కాళ్ల నొప్పులు, నీరసం అంటుంటే నాకు డౌట్ వచ్చి.. వెంటనే వాళ్లన ఇంటి నుంచి బయటకు పంపి.. వేరే ఫ్లాట్‌ తీసుకుని వీళ్లందర్నీ క్వారంటైన్‌లో ఉంచి వ్యాధి తగ్గే వరకూ ట్రీట్ మెంట్ ఇప్పించి.. భోజనాలు కూడా పెట్టించి రికవరీ అయ్యేలా చేశాం. వాళ్లకి రెండుసార్లు బ్లడ్ టెస్ట్‌లు చేయించాం. వాళ్లకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చాయి కానీ.. బాడీలో మాత్రం యాంటీ బాడీస్ ఉన్నాయి. అందుకే వాళ్లతో ప్లాస్మా దానం చేయించాలని తీసుకుని వచ్చాను. వీళ్లు ఒక్కసారి ప్లాస్మా దానం చేస్తే కనుక మూడు ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది. బిడ్డల్ని కన్న ఆ మహిళ ప్లాస్మా దానం చేయకూడదని అన్నారు. కానీ ఆమె కూడా ప్లాస్మా దానం చెయ్యడానికి రెడీ అయ్యింది” అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ నలుగుర్నీ మీడియా ముందుకు తీసుకువచ్చారు.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus