‘మా నగరం’ (Maanagaram) (తెలుగులో ‘నగరం’) సినిమాతో దర్శకుడిగా మారిన లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj).. ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. కానీ ఆ తర్వాత కార్తీని (Karthi) ఒప్పించి ‘ఖైదీ’ (Kaithi) చేశాడు. ఊహించని విధంగా అది సూపర్ సక్సెస్ అందుకుంది. స్క్రీన్ ప్లే పరంగా ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది ఈ మూవీ. ఆడియన్స్ కి అది బాగా కనెక్ట్ అవ్వడం వల్ల.. ‘ఖైదీ’ ని ఓ కల్ట్ మూవీగా నిలబెట్టారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని వెంటాడతాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ముఖ్యంగా కార్తీ.. బిర్యానీ తినే సీన్ అయితే మీమ్స్ రూపంలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ‘ఖైదీ’ క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి మంచి లీడ్ ఇచ్చారు. సో ‘ఖైదీ 2’ కచ్చితంగా ఉంటుంది అని అంతా ఫిక్స్ అయ్యారు. ‘విక్రమ్’ (Vikram) సినిమాకి కూడా ‘ఖైదీ’ తో లింక్ చేశాడు దర్శకుడు లోకేష్. అది కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత ‘ఖైదీ 2’ వైపు లోకేష్ దృష్టి పెట్టడం లేదనుకుంట. ఆ తర్వాత అతను ‘లియో’ (LEO) చేశాడు.
వెంటనే మళ్ళీ రజినీకాంత్ తో (Rajinikanth) ‘కూలీ’ (Coolie) అనే సినిమా మొదలుపెట్టాడు. ఇది పూర్తి చేశాక ‘విక్రమ్ 2’ లేదా ప్రభాస్ తో (Prabhas) సినిమా చేయాలని చూస్తున్నాడు లోకేష్. సో ప్రస్తుతానికి అతను ‘ఖైదీ 2 ‘ పై దృష్టి పెట్టడం లేదని తేలిపోయింది. అందుకే కార్తీ కూడా ‘సర్దార్ 2’ కి (Sardar2) గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.