Kajal, Allu Arjun: సౌత్ నుండి బన్నీ కాజల్ టాప్లో ఉన్నారట..!

గూగుల్‌లో జనాలు అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రెటీలు అనే జాబితాని తాజాగా ఆ సంస్థ విడుదల చేసింది. ఇందులో సౌత్ నుండీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. వరల్డ్ వైడ్ గా అయితే 39వ స్థానంలో నిలిచాడు బన్నీ. దక్షిణాది స్టార్స్‌లో బన్నీ టాప్‌లో నిలిచాడు. ఆ తర్వాత కోలీవుడ్ హీరో సూర్య 55వ స్థానంలో నిలిచాడు. ఇక అటు తర్వాత మహేష్ బాబు 72 వ స్థానంలో, ప్రభాస్ 77 వ స్థానంలో నిలిచారు.దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

గతేడాది అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం రిలీజ్ అయ్యింది. ఆ చిత్రంలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటన నార్త్ సోదరులను అమితంగా ఆకట్టుకుంది. తెలుగులో కంటే ఈ మూవీ బాలీవుడ్లోనే సూపర్ హిట్ గా నిలిచింది. పుష్ప రాజ్ పాత్రని బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. ఆ సినిమాకి ముందు నుండీ అల్లు అర్జున్ కు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

అక్కడి సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్స్ అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక హీరోయిన్లలో అయితే సౌత్ నుండీ కాజల్ అగర్వాల్ టాప్ పొజిషన్ లో నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈమె 11 వ స్థానంలో నిలిచింది. ఈమె తర్వాతి స్థానంలో సమంత 18వ స్థానంలో నిలిచింది. అలాగే 25 వ స్థానంలో రష్మిక మందన, 28వ స్థానంలో తమన్నా, 42 వ స్థానంలో అనుష్క శెట్టి, 49వ స్థానంలో కీర్తి సురేష్ నిలిచారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus