కొత్తగా విడుదలైన సినిమాలకు సరైన టాక్ రాకపోతే.. బాక్సాఫీస్ దగ్గర ఉన్న పాత సినిమాలు అడ్వాంటేజ్ తీసుకోవడం మామూలు విషయమే. తమ సినిమాను మరింత ప్రమోట్ చేస్తూ.. సిట్యుయేషన్ ను వాడుకోవాలనుకుంటారు. కానీ బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ఈ అడ్వాంటేజ్ ను పెద్దగా వాడుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఈ నెల 9న విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టగలిగింది. దానికి క్రేజ్ తొలి వీకెండ్ వరకే పరిమితమైంది.
సోమవారం నుంచి సినిమా డల్ అయిపోయింది. కలెక్షన్స్ కూడా డ్రాప్ అయ్యాయి. వీక్ డేస్ లో ఏవరేజ్ కలెక్షన్స్ ను రాబట్టింది. వీకెండ్ వచ్చాక సినిమా పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతుంది. ఈ వీకెండ్ హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాలేదు. విడుదలైన సినిమాలను కూడా జనాలు పట్టించుకోవడం లేదు. ఇక తెలుగులో ఈ వారం విడుదలైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’,
‘మీకు నేను బాగా కావాల్సిన వాడిని’, ‘శాకిని డాకిని’ ఇలా ఏ సినిమాకి పాజిటివ్ టాక్ రాలేదు. మిగిలిన సినిమాలను జనాలు పట్టించుకోవడం లేదు. దీంతో రెండో వారం అటు హిందీలో, ఇటు తెలుగులో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి కలిసొచ్చే పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం నాడు ఈ సినిమా రూ.8.5 కోట్ల వసూళ్లను రాబట్టింది.
బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా ఇంకా రూ.200 కోట్లు రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లో రోజుకి రూ.30 నుంచి రూ.40 కోట్లు వస్తే తప్ప బయట పడేలా లేరు. తెలుగులో సినిమా బ్రేక్ ఈవెన్ అయినా.. హిందీలో మాత్రం సగం కూడా రికవరీ అవ్వలేదు. ఈ రెండు రోజుల్లో సినిమా పరిస్థితి బెటర్ అవుతుందేమో చూడాలి!