“LYF – లవ్ యువర్ ఫాదర్” మూవీ సినీ ప్రియుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తూ సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. తండ్రి-కొడుకుల అనుబంధాన్ని ఎమోషనల్‌గా, హృదయానికి హత్తుకునేలా చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. SP చరణ్, శ్రీ హర్ష, కషిక కపూర్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 4న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ట్రైలర్‌లోని పవర్‌ఫుల్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ డెప్త్ చూస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసే అన్ని ఎలిమెంట్స్ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. దీంతో సినీ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. మరి ఏప్రిల్ 4న థియేటర్లలో “LYF” ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
సినిమా పేరు : ఎల్ వై ఎఫ్ – లవ్ యువర్ ఫాదర్
నటీనటులు : శ్రీహర్ష, ఎస్పీబి చరణ్, కషిక కపూర్, ప్రవీణ్, చత్రపతి శేఖర్, రఘు బాబు, భద్రం, షకలక శంకర్, శాంతి కుమార్, బంటి తదితరులు.
రచన, దర్శకత్వం : పవన్ కేతరాజు
డైలాగ్స్ : నాగ మాధురి
సంగీత దర్శకుడు : మణిశర్మ
బ్యానర్స్ : అన్నపరెడ్డి స్టూడియోస్, మనిషా ఆర్ట్స్
నిర్మాతలు : రామస్వామి రెడ్డి, కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఎ. సామ్రాజ్యం, ఎ. చేతన్ సాయిరెడ్డి.
ఆర్ట్: శంకర్ చిడిపల్లి
కాస్ట్యూమ్ డిజైనర్ : భావన పోలేపల్లి
కాస్ట్యూమర్ : రాంబాబు
కొరియోగ్రఫీ : మొయిన్
ఎడిటర్ : రామకృష్ణ
డిఓపి : శ్యామ్ కే నాయుడు
PRO : మధు విఆర్