బాలీవుడ్ వెబ్ సిరీస్‌లు అంటే.. ఓ ఆలోచన ఆటోమేటిగ్గా మనసులో క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ రావడం, అది భారీ హిట్ అవ్వడంతో ఆ ఆలోచన ఎక్కువైంది. అవే బూతులు. అంతకుముందు కూడా బూతులు అక్కడి వెబ్ సిరీస్‌లో ఎక్కువగానే ఉండేవి. మనకు అంటే సౌత్ వాళ్లకు ఆ మాటలు కాస్త ఇబ్బందిగా అనిపించినా.. బాలీవుడ్‌లో మాత్రం సర్వసాధారణమైపోయాయి. ఇప్పుడెందుకు ఈ బూతుల పంచాయితి అనుకుంటున్నారా? ఎందుకంటే ‘రానా నాయుడు’ ట్రైలర్ వచ్చింది కాబట్టి.
వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ సిరీస్‌లో తండ్రి కొడుకులుగా నటిస్తున్న రానా, వెంకీల మధ్య పోరు మామూలుగా లేదు. ట్రైలర్‌లోనే ఆ కోపాలు, పగలు, ప్రతీకారాలు కనిపిస్తున్నాయి. వాటితోపాటు బూతులు కూడా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. రానా నోటి నుండి వచ్చే మాటల్లో కోపం కనిపిస్తున్నా, వెంకటేశ్ మాటల నుండి మాత్రం కాస్త ఇబ్బందికరమైన మాటలే వినిపిస్తున్నాయి. దీంతో ట్రైలర్‌లోనే ఇలా ఉంది అంటే పరిస్థితి.. సిరీస్‌లో ఏంటో అనే ప్రశ్న వినిపిస్తోంది.
పాపులర్ అమెరికన్ సిరీస్ ‘రే డోనోవన్’ స్ఫూర్తితోనే ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ రూపొందించారు. అయితే మన దేశం నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారని సమాచారం. ఈ సిరీస్‌ను హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ విడుదల చేస్తున్నారు. ‘మీర్జాపూర్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సిరీస్‌కూ దర్శకత్వం వహించారు. దీంతోనే ఇందులోనూ బూతుల పండగ ఉంది అని అంటున్నారు.
నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. పైన మేం చెప్పిన బూతుల పండగ అనే మాట ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. కచ్చితంగా వినే ఉంటారు. ఆ మధ్య బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోకి రానా వెళ్తే.. ‘మీ బాబాయి నువ్వు ఏదో సిరీస్ చేస్తున్నారటగా.. మొత్తం బూతుల పండగటగా’ అని బాలయ్య అన్నాడు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?