‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. అయితే ఇన్ని రోజులు ఈ ప్రాజెక్టు ఉంటుందా ఉండదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కొరటాల అనుకోని పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీల్లో చిక్కుకోవడం వల్ల ఈ ప్రాజెక్టు పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ రేపు అంటే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
‘ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్ 30’ అనే పేరుతో ఈ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఓ పక్క సముద్రం.. ఇంకో పక్క భారీ వర్షం.. ఉరుములు మెరుపులు మధ్యలో శత్రుసంహారం చేస్తూ హీరో కత్తులతో నిలబడినట్టు చూపించి ఎన్టీఆర్ అభిమానులకు కావాల్సిన హై ఇచ్చారు. ‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తనుండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా..!’ అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్లో వచ్చే డైలాగ్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.
ఈ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేయబోతున్నారు.నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల స్నేహితులు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!