ఆర్యాన్ గౌర హీరోగా దివ్య పాండే హీరోయిన్ గా సాయి సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ గౌర-దీపు స్వీయ దర్శకత్వంలో సూర్య నిర్మించిన చిత్రం “జి- జాంబీ”. తెలుగులో మొదటిసారి గా జాంబీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ సంపాదించుకుంది.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఫిబ్రవరి 5న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్బంగా ప్రీ-రిలీజ్ వేడుకను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిపారు.. సాంగ్స్, ట్రైలర్స్ ప్రదర్శించిన అనంతరం ఈ కార్యక్రమంలో…
హీరో ఆర్యాన్ గౌర మాట్లాడుతూ.. ‘ బేసిగ్గా నేను సాఫ్ట్ వేర్ ని. హీరో అవ్వాలనేది నా కల. ఇక్కడిదాకా రావడానికి ఏడేళ్లు పట్టింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటిదాకా రకరకాల సినిమాలు చూసుంటారు. జాంబీస్ జోనర్లో ఇంతవరకూ తెలుగులో సినిమా రాలేదు. జాంబీ జోనర్లో కొత్తగా సినిమా చేశాం. ఇదే ఫస్ట్ టైమ్. డే అండ్ నైట్ కష్టపడి ఈ చిత్రానికి వర్క్ చేశాం. నన్ను నా కథని నమ్మి కొత్తవాల్లమైనా బడ్జెట్ కి వెనకాడకుండా మా నిర్మాత సూర్య గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనకి లైఫ్ లాంగ్ ఋణపడి ఉంటాను. మైక్రో ఇయర్ సౌండ్ డిజైన్ ని కొత్తగా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. అదొక కొత్త ఎక్స్ పీరియెన్స్ కలిగిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి వర్క్ చేశారు. వారందరికీ నా థాంక్స్. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 5న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం.. ప్రేక్షకులు మా చిన్న సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
హేమంత్ మధుకర్ మాట్లాడుతూ.. ఆల్ రెడీ హాలీవుడ్, హిందీ భాషల్లో జాంబీస్ జోనర్ లో సినిమాలు వచ్చాయి. మన తెలుగులో రావడం ఇదే ఫస్ట్ టైమ్. ట్రైలర్ చాలా బాగుంది. జాంబీస్ లో స్పెషల్ ఏంటంటే అందులో హార్రర్, భయం ఉంటూనే ఒక ఫన్ ఉంటుంది. అది ఈ చిత్రంలో బాగా కనిపిస్తుంది. ఆర్యాన్ లో మంచి ఫైర్ ఉంది. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ సినిమా చేశాడు. డెఫినెట్ గా సినిమా బాగుంటుంది.. మంచి హిట్ కావాలని.. అన్నారు.
పాటల రచయిత రాంబాబు గోసాల మాట్లాడుతూ.. ‘ కోవిడ్ టైమ్ లో ఈ సినిమా షూటింగ్ చేశారు. జాంబీస్ జోనర్ లో ఫస్ట్ టైమ్ చేస్తున్నారు. నిర్మాత సూర్య చాలా బాగా సపోర్ట్ చేసి సినిమాని పూర్తిచేశారు. ఇందులో రెండు పాటలు రాశాను. వినోద్ మంచి ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఒక ప్రక్క జాబ్ చేస్తూ.. మరో పక్క హీరోగా చేయాలని ట్రై చేశాడు ఆర్యాన్. నేను కూడా ఇంజినీరింగ్ చేశాఖ సినిమా పాటలు రాశాను. ఆర్యాన్ చాలామందికి ఇన్స్పిరేషన్ కలిగించాడు. డైరెక్టర్ దీపు మంచి డైరెక్టర్ గా ఎదగాలి.. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
దర్శకురాలు దీపు మాట్లాడుతూ.. ‘ ఎంతోమందిని చూసి ఇన్స్పైర్ అయి ఈ సినిమాకి దర్శకత్వం వహించాను. ఆర్యాన్, సూర్య లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా స్టార్టింగ్ నుండి ఇప్పటివరకూ తోడుగా ఉండి ఎన్నో విషయాల్లో హెల్ప్ చేసిన ఆర్యాన్ కి నా స్పెషల్ థాంక్స్. అలాగే నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేసి సినిమా బాగా రావడానికి సహకరించారు. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు.. అన్నారు.
ఆర్యన్ గౌర, దివ్య పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్, పద్మావతి, లోకేష్ చరణ్ ఉత్తరాది, యువతేజ, గౌతమ్ ఆవుల, మనోజ్ వనపాల, హర్ష సాధుల, విజయ్ కృష్ణ చావకుల, హర్ష నల్లబెల్లి, నేత, చిస్తీ, మారురి హర్ష, జస్వంత్, బండ మహేష్, శరత్, రాగ, సుష్మిత తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్; వినోద్ కుమార్, డివోపి; యస్.ఆర్ శేఖర్, ఎడిటర్; పవన్ కుమార్ .వి, ఆర్ట్; శివ బోగోలు, కొరియోగ్రఫీ; వి.యమ్. కృష్ణ, పాటలు; రాంబాబు గోసాల, పీఆర్ఓ; తేజస్వీ సజ్జ, నిర్మాత; సూర్య, రచన-దర్శకత్వం; ఆర్యన్ అండ్ దీపు.