(Vishwak Sen) విశ్వక్ సేన్, చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ (Gaami) ‘గామి’. విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh)ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మార్చి 8 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. ఇదిలా ఉండగా… నిర్మాత కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని క్రౌడ్ ఫండింగ్ సాయంతో .. చాలా కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఈయన గురించి ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసుండకపోవచ్చు. గతంలో ‘మను’ అనే చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగింది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ ను కూడా నిర్మించడం జరిగింది. అంతేకాదు ఈయన యాక్టింగ్ కూడా చేశాడు అనే విషయం చాలా మందికి తెలిసుండదు.
అవును కార్తీక్ శబరీష్ గతంలో (Naga Chaitanya) నాగ చైతన్య హీరోగా నటించిన (Majili) ‘మజిలీ’ సినిమాలో నటించాడు. (Shiva Nirvana) శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆయన మొదట్లో ఓ క్రికెటర్ గా కనిపిస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ లో ఓ స్టార్ హోటల్ కి మేనేజర్ గా కూడా కనిపిస్తాడు. ఇదే అంశంపై కార్తీక్ శబరీష్ ‘గామి’ ప్రెస్ మీట్ లో స్పందించి.. నవ్వుకున్నారు కూడా.
'మజిలీ' లో 'గామి' నిర్మాత?! #majili #Gaami @KarthikSabaresh @vcelluloidsoffl #nagachaitanya pic.twitter.com/DZWmn1cEFW
— Phani Kumar (@phanikumar2809) March 10, 2024
భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!