‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ స్ట్రాంగ్ హిట్టు కొట్టి 11 ఏళ్ళు అవుతుంది…. ‘ఖుషి’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ మళ్ళీ ఎప్పుడిస్తాడు రా బాబు’ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజులవి..! ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘పులి’ ‘పంజా’ ‘తీన్ మార్’ వంటి సినిమాలు ఒక దానికి మించి ఒకటి అన్నట్టు డిజాస్టర్లు అవ్వడంతో వాళ్ళు మరింత డిజప్పాయింట్మెంట్ తో ఉన్నారు. అలాంటి టైములో అంటే 2012 వ సంవత్సరం మే 11న ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలయ్యింది.
హరీష్ శంకర్ డైరెక్షన్లో బండ్ల గణేష్ నిర్మాతగా.. బాలీవుడ్ సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.’దూకుడు’ రికార్డులను బ్రేక్ చేసి ‘మగధీర’ తరువాత టాలీవుడ్ టాప్ 2 మూవీ గా నిలిచింది ‘గబ్బర్ సింగ్’.
ఈరోజు తో ఈ చిత్రం విడుదలయ్యి 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది మరి ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :
నైజాం
19.50 cr
సీడెడ్
9.30 cr
ఉత్తరాంధ్ర
5.50 cr
ఈస్ట్
3.75 cr
వెస్ట్
3.43 cr
గుంటూరు
4.35 cr
కృష్ణా
3.18 cr
నెల్లూరు
2.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
51.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
4.80 cr
ఓవర్సీస్
4.30 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
60.16 cr
‘గబ్బర్ సింగ్’ చిత్రానికి రూ.37.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.60.16 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు ఏకంగా రూ.22.56 కోట్ల లాభాలు దక్కాయని స్పష్టమవుతుంది.