‘గేమ్ చేంజర్’ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో 6 వేలకు పైగా థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు విడుదలకు ముందే లీక్ కావడం, పైగా ఈ సంఘటన చిత్ర బృందానికి ఆందోళన కలిగించింది. సాంకేతిక నైపుణ్యాలతో రూపొందిన ఈ సినిమా పైరసీ ముఠాలకు లక్ష్యంగా మారింది. సినిమాకు సంబంధించిన HD ప్రింట్ విడుదల చేసి బాక్సాఫీస్ వసూళ్లకు తూట్లు పొడవాలన్న కుట్ర సాగించినట్లు సమాచారం.
పైరసీ ముఠా సభ్యులు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే మరింత చిత్రాన్ని లీక్ చేస్తామని బెదిరించరని మేకర్స్ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సినిమా విడుదల రోజే తెల్లవారుజామున పలు టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులలో పైరసీ ప్రింట్ విస్తరించడంతో సినిమా టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించింది. ఈ సంఘటనపై దర్యాప్తు మొదలైంది.
ప్రస్తుత సమాచారం ప్రకారం, 45 మందికి పైగా ఈ కుట్రలో భాగమైనట్లు ఆధారాలు లభించాయి. పైరసీ వెనుక ఉన్న ప్రధాన ముఠాను పట్టుకునే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. పరిశ్రమ వర్గాలు మాత్రం ఈ లీక్ సినిమాకు భారీ నష్టం చేకూర్చే ప్రమాదముందని భావిస్తున్నాయి. ఈ సంఘటన టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశమైంది. దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పైరసీ దాడి తీవ్ర నిరాశ కలిగించింది.
ఇటువంటి సంఘటనలు సినిమాల ప్రతిష్టను దెబ్బతీస్తాయని, బడ్జెట్ పరంగా సినిమాకు నష్టం కలిగే అవకాశాలున్నాయని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చిత్ర బృందం మరింత ముందస్తు చర్యలు తీసుకుంటుందని సమాచారం. ఫ్యాన్స్ మాత్రం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. సినిమా థియేటర్ అనుభవాన్ని డిజిటల్ పైరసీ నాశనం చేస్తుందని, ప్రేక్షకులంతా పెద్ద తెరపై చిత్రాన్ని ఆస్వాదించాలని సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నాయి.