రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద హైప్ మరింత పెరిగింది. శంకర్ గతంలో రూపొందించిన ‘జెంటిల్మన్’, ‘ఒకే ఒక్కడు’ లాంటి సినిమాలు సామాజిక అంశాలతో ఉండగా, ఈ మూవీ కూడా అదే తరహాలో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా కథలో రెండు ప్రధాన ట్విస్టులు ఉంటాయని టాక్. ఈ ట్విస్టులు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకునేలా ఉంటాయట. మొదటి ట్విస్ట్ ఇంటర్వెల్ సమయంలో ఉంటుందని, అది యాక్షన్ బ్లాక్ ద్వారా అద్భుతంగా చిత్రీకరించారని సమాచారం. ఈ సీన్ రెండో భాగానికి మరింత ఆసక్తి రేకెత్తిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, రెండవ ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్‌లో ఉంటుందని, ఇది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సీన్స్‌లో రానుందని అంటున్నారు.
ఈ ట్విస్ట్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్. అందరి ఫోకస్ కూడా దీనిపైనే ఉంది. ఎందుకంటే అప్పన్న పాత్రలో చరణ్ పెర్ఫెమెన్స్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్, ఎస్ జె సూర్య మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించబోతున్నాయని అంటున్నారు. ప్రత్యేకంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ కానుందని సమాచారం. ఈ సినిమాలోని ‘జరగండి’ సాంగ్ గురించి కూడా ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది.
శంకర్ తన మార్క్ డైరెక్షన్‌తో ఈ సాంగ్‌ను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లారట. సాంగ్స్ కోసం చిత్ర బృందం దాదాపు రూ. 75 కోట్లు ఖర్చు చేయడం విశేషం. అలాగే రామ్ చరణ్, అంజలి పాత్రలు ఈ సినిమాకు గొప్ప ఎమోషనల్ టచ్ ఇస్తాయని భావిస్తున్నారు. అంజలి (Anjali ) పాత్రకు చెందిన ట్విస్ట్ కూడా చిత్ర కథను మరో మెట్టుపైకి తీసుకెళ్తుందని అంటున్నారు. కియారా అద్వానీ (Kiara Advani) చరణ్‌కు జోడీగా నటించగా, ఆమె పాత్ర కూడా కొత్తగా ఉండబోతోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.