Game On Review in Telugu: గేమ్ ఆన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 3, 2024 / 01:05 AM IST

Cast & Crew

  • గీతానంద్‌ (Hero)
  • నేహా సోలంకి (Heroine)
  • ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌ (Cast)
  • దయానంద్ (Director)
  • రవి కస్తూరి (Producer)
  • అభిషేక్ ఏ.ఆర్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్ (Music)
  • అర‌వింద్ విశ్వనాథ‌న్‌ (Cinematography)

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరడజను సినిమాల్లో ‘గేమ్ ఆన్’ కూడా ఒకటి. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన మూవీ ఇది. టీజర్, ట్రైలర్స్ కొంతలో కొంత బజ్ ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రిలీజ్ కి ముందు ‘బుక్ మై షోలో’ 15వేల మంది వరకు ఈ సినిమా పై ఇంట్రెస్ట్ చూపించడం కూడా చర్చనీయాంశం అయ్యింది. మరి సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

కథ: గౌతమ్ సిద్ధార్థ్ అలియాస్ సిద్దు(గీతానంద్)..ది చిన్న ప్రపంచం. అతని ఆఫీస్, ప్రియురాలు మోక్ష(బిగ్ బాస్ వాసంతి), బెస్ట్ ఫ్రెండ్ రాహుల్. వీళ్ళే అతని సర్వస్వంగా భావిస్తాడు. కానీ ఒక రోజు ఇతను బాస్ చేతిలో చివాట్లు తింటాడు.అలాగే రెండు రోజుల్లో ఫినిష్ అవ్వని టాస్క్ బాస్ సిద్దుకి ఇచ్చి మరింత ఇబ్బంది పెడతాడు. అదెలా ఉన్నా.. తన కంపెనీకి మంచి ఆఫర్ తెచ్చే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతాడు సిద్దు. కానీ ఆ క్రెడిట్ ని అతని బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న రాహుల్ కొట్టేస్తాడు. ప్రమోషన్ కూడా అతనికే వెళ్తుంది. సిద్దు జాబ్ కోల్పోతాడు. ఆ తర్వాత మోక్ష కూడా రాహుల్ తో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకుని సిద్ధుని చీట్ చేస్తుంది. దీంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు సిద్దు. ఆ టైంలో ఇతను ఊహించని గేమ్ ఆడతాడు. దీంతో అతనికి లక్షలు వచ్చి పడతాయి. తర్వాత అదే గేమ్ ని కంటిన్యూ చేయగా మరిన్ని లక్షలు వస్తాయి. అంతేకాకుండా అతనికి మరిన్ని సమస్యలు కూడా వస్తాయి? అవేంటి? సిద్దు ఆడిన గేమ్ డిజైన్ చేసింది ఎవరు? మధ్యలో తార(నేహా సోలంకి) ఎవరు? ఆమె సిద్దు జీవితంలో ఎలా ప్రవేశించింది.? వంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు: గీతానంద్ కి హీరోగా ఇది తొలి సినిమానే అయినప్పటికీ బాగానే పెర్ఫార్మ్ చేశాడు. యాక్షన్ సీన్స్ లో, రొమాంటిక్ సీన్స్ లో కూడా బాగా చేశాడు. కాకపోతే ఇతని వాయిస్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా లేకపోవడం మైనస్ గా చెప్పుకోవాలి. హీరోయిన్ నేహా సోలంకి అందాలు వడ్డించడంతో పాటు సిగరెట్లు వంటివి కాలుస్తూ చాలా బోల్డ్ గా కనిపించింది. బిగ్ బాస్ వాసంతి కూడా గ్లామర్ తో పాటు బెడ్రూమ్ సీన్స్ లో కనిపించింది షాకిచ్చింది. మధుబాల, శుభలేఖ సుధాకర్ పాత్రలు ఆకట్టుకుంటాయి. జెమినీ సురేష్, ‘బలగం’ లక్ష్మీ చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. కిరీటి ఓకే. ఆదిత్య మీనన్ విలన్ గా తన మార్క్ నటన చూపించాడు. మిగిలిన నటీనటులు ఓకే అనిపిస్తారు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు దయానంద్ సినిమాని ఇంట్రెస్టింగ్ స్టార్ట్ చేశాడు. కానీ తర్వాత ల్యాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ బాగానే ఉంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ బాగానే టైం పాస్ చేయిస్తుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ డోస్ పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ తర్వాత ఊహించని ట్విస్ట్..లు వచ్చి కాసేపు థ్రిల్ చేస్తాయి. క్లైమాక్స్ కూడా బాగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమా చూస్తున్నాము అనే ఫీలింగ్ లేకుండా చేస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలే కావడం ఇంకో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

విశ్లేషణ: మొత్తంగా ‘గేమ్ ఆన్’ డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అక్కడక్కడా ల్యాగ్ అనిపించినా టార్గెటెడ్ ఆడియన్స్ ను ఈ మూవీ మెప్పించే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus