మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ భిన్నమైన కథలను ఎంచుకునే విషయంలో ముందువరసలో ఉంటారు. సోలో హీరోగా ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని వరుణ్ తేజ్ కు గాండీవధారి అర్జున మూవీ ఫలితం మరో షాకిచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. నిర్మాతలకు ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది.
థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. సెప్టెంబర్ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో అయినా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా అనే చర్చ జరుగుతుండటం గమనార్హం.
ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా సాక్షి వైద్య నటించారు. తెలుగులో సాక్షి వైద్యకు వరుస ఆఫర్లు వస్తున్నా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటం ఆమె కెరీర్ కు శాపంగా మారింది. కమర్షియల్ గా సక్సెస్ సాధించే సత్తా ఉన్న స్క్రిప్ట్ లను వరుణ్ తేజ్ ఎంచుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
కథల ఎంపిక విషయంలో పొరపాట్లు చేస్తే వరుణ్ తేజ్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి. వరుణ్ తేజ్ పారితోషికం 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. వరుణ్ తేజ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. త్వరలో వరుణ్ తేజ్ లావణ్య వివాహం జరగనుండగా పెళ్లి తర్వాత లావణ్య సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తారో లేదో తెలియాల్సి ఉంది.