Ganesh Acharya: లక్ష రీల్స్‌ పాట వెనుక కథ ఇదీ… డ్యాన్స్‌ మహారాజా ఏం చెప్పారంటే?

ఓ పాట హిట్‌ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే.. ఒకప్పుడు ఎక్కువ క్యాసెట్లు, సీడీలు అమ్ముడుపోతే అని చెప్పేవారు. ఇప్పుడు అయితే యూట్యూబ్‌లో, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌లో వ్యూస్‌ లెక్క కట్టి చెబుతున్నారు. అయితే యువత ఆ పాటను ఇంకా బాగా ఆదరించారు అని చెప్పడానికి ఆ పాటలోని హుక్‌ స్టెప్‌తో వచ్చిన రీల్స్‌ సంఖ్యే కొలమానం. అలా రీసెంట్‌గా లక్ష రీల్స్‌ ఫీట్‌ సాధించిన పాట ‘కపుల్‌ సంగ్‌’ ఫ్రమ్‌ ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule).

ఈ పాట గురించి కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్య ఏమన్నారో తెలుసా?అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) – రష్మిక మందన (Rashmika Mandanna)  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రచారం షురూ చేశారు. అందులో భాగంగా ‘కపుల్‌ సాంగ్‌’ అంటూ ఒకటి విడుదల చేశారు. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీలో రూపొందిన ఆ పాటను విజయ్‌ పోలాకి, శ్రష్ఠి వర్మ డ్యాన్స్‌ కంపోజ్‌ చేశారు.

ఈ పాట కోసం 8 రోజులు షూట్‌ చేశారట. ‘కపుల్‌ సాంగ్‌’ రిచ్‌గా ఉంటుంది అని చెప్పిన గణేశ్‌ ఆచార్య.. లిరికల్ వీడియోలో చూపించింది కేవలం మేకింగ్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. 500 మందికి పైగా డ్యాన్సర్లు ఈ పాటలో ఉంటారని, ఎనిమిది రోజులపాటు ఈ షూటింగ్ చేశామని గణేశ్‌ ఆచార్య చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్‌ సులభంగా డ్యాన్స్ చేసేలా హుక్ స్టెప్ డిజైన్ చేశామని తెలిపారు.

అనుకున్నట్లుగానే ఆ స్టెప్‌ను లక్ష మంది రీల్స్‌ చేసేశారు. ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa: The Rise) సినిమాలోని సమంత ఐటెమ్‌ సాంగ్‌ను గణేశ్‌ ఆచార్యనే కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు కూడా రెండో ‘పుష్ప’లో ఆయనే ఐటెమ్‌ సాంగ్‌ కొరియోగ్రఫీ చేస్తారట. మరి అందులో ఎవరు డ్యాన్స్‌ చేస్తారో చూడాలి. ఇప్పటికే చాలామంది కథానాయికల పేర్లు వినిపించినా ఇంకా ఎవరూ ఫైనల్‌ కాలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus