బిగ్ బాస్‌ ముందు గంగవ్వ కన్నీరు మున్నీరు..!

రెండో వారం మొదలైనప్పటి నుంచి గంగవ్వ ఇంట్లో ఉంటానికి ఇబ్బంది పడుతోంది. ఈ రోజు చాలా ఇబ్బంది పడిపోయింది. ఒంట్లో బాగా నలతగా ఉండటంతో నీరసంగా అయిపోయి బెడ్‌ మీద వాలిపోయింది. పరిస్థితి గమనించిన బిగ్‌బాస్‌ గంగవ్వను కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిపించి మాట్లాడాడు. ఆరోగ్యం ఎలా ఉందో ఆరా తీశాడు బిగ్‌బాస్‌.. ‘‘నేను ఇంట్లో చాలా రోజులు ఉందామనే అనుకున్నా. నన్ను ఇక్కడ అందరూ బాగానే చూసుకుంటున్నారు కూడా. శరీరం సహకరించడం లేదు. ఇబ్బందిగా ఉంటోంది. సరైన విశ్రాంతి కూడా లేకపోవడంతో ఇంకా ఇబ్బంది అనిపిస్తోంది’’ అని చెప్పింది.

దానికి బిగ్‌ బాస్‌ స్పందిస్తూ ‘‘మీ ఆరోగ్యం విషయంలో కంగారుపడకండి’’ అని చెప్పాడు. అయితే గంగవ్వ మాట్లాడుతూ ‘‘నేను ఇక్కడ ఇంకా ఉంటే ఇబ్బంది అవుతుందేమో. ఇక్కడ ఉంటే దుప్పటి కప్పుకొని ఉండటమే కదా. అదే మా ఇంటికి పోతే ప్రశాంతంగా ఉంటా ’’ అని తన బాధ చెప్పింది గంగవ్వ. ‘‘ఇంట్లో నన్ను మంచిగా భోజనం పెడుతున్నారు. బాగా చూసుకుంటున్నారు. అయినా ఇక్కడ ఉండటం నా తరం కావడం లేదు. ఓ తల్లీ తండ్రి చూసినట్లు నన్ను చూసుకుంటున్నారు.

నా వాళ్లు ఎవరూ లేరు.. నాకు నీడ లేదని ఇక్కడికి వచ్చాను. కానీ ఉండలేకపోతున్నాను. మట్టిలో పెరిగిన శరీరం కదా.. ఇక్కడ ఏసీలు పడటం లేదు’’అని చెప్పింది. ‘మీరు గట్టి మనిషి… ఎన్నో కష్టాలు దాటి ఇక్కడికి వచ్చారు’ అంటూ బిగ్‌బాస్‌ ధైర్యం చెప్పి గంగవ్వను వైద్యుల పర్యవేక్షణకు పంపించారు. మరి గంగవ్వ అక్కడి నుంచి తిరిగి హౌస్‌లోకి వస్తుందా లేదా కొన్నాళ్లు పర్యవేక్షణలో ఉంటుందా అనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus