Rajamouli: రాజమౌళి రిక్వెస్ట్.. వెనక్కి తగ్గిన డైరెక్టర్!

  • November 15, 2021 / 06:26 PM IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అన్ని భాషల్లో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. ‘బాహుబలి’ తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడం, పైగా అజయ్ దేవగన్, అలియా భట్ లాంటి స్టార్లు ముఖ్యపాత్రలు పోషించడంతో ఈ సినిమాకి బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది.

అయితే ఈ సినిమాకి ఒక్కరోజు ముందు అలియా భట్ నటించిన ‘గంగూబాయి కథియావాడి’ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకన్నాయి. అయితే అలియా నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం కరెక్ట్ కాదని.. రాజమౌళి ‘గంగూబాయి కథియావాడి’ దర్శకనిర్మాతలను రిక్వెస్ట్ చేశారు. ఫైనల్ గా భన్సాలీ తన సినిమాను వాయిదా వేసుకోవడానికి ఒప్పుకున్నారు.

ఫిబ్రవరి 18కి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు కొత్త డేట్ ప్రకటించారు. ముంబైలోని కామాఠిపుర ప్రాంతానికి చెందిన వేశ్య జీవితం ఆధారంగా ‘గంగూబాయి’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అలియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలానే హుమా ఖురేషీ, అజయ్ దేవగన్ కీలకపాత్రలు పోషించారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus