రాంబాబు(తనికెళ్ళ భరణి) లేకలేక కలిగిన సంతానం అని వరాలబాబు(ఆది) అని పేరు పెట్టుకుంటాడు. కానీ మన వరాలబాబు ఏమో చిన్నప్పటి నుంచీ చదువు సంధ్యా ఎక్కక జులాయిలా పెరుగుతాడు. కట్ చేస్తే ఓ రోజు పక్కింటి వాళ్ళ వారసుడు ఏదో అయిపోతున్నారని తక్కువ చేసి మాట్లాడుతుండడంతో, వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకోమని చెప్పడం కాదు, నన్ను చూసుకొని నేర్చుకోమనే స్టేజ్ కి వస్తా అని చెప్పి ఊరి నుంచి సిటీకి బస్ ఎక్కుతాడు. అలా హైదరబాద్ లో దిగగానే మన హీరో హీరోయిన్ సమీర(ఆదాశర్మ)ని చూసి ప్రేమలో పడతాడు. ఇక అక్కడి నుంచి లుక్ అండ్ గెటప్ మార్చి సమీరని ఇంప్రెస్ చేసే పనిలో పడతాడు. కట్ చేస్తే ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్.. సమీరకి బిజ్జు(కబీర్ దుహన్ సింగ్) నుంచి ఓ సమస్య వస్తుంది. అసలు ఈ బిజ్జు ఎవరు, బిజ్జు తెచ్చిన సమస్య ఏంటి? సామాన్య యువతి అయిన సమీరకి అంత పెద్ద సమస్య రావడానికి గల కారణం ఏంటి? వీటన్నిటినీ క్లియర్ చేసిన వరాల బాబు చివరికి తన ప్రేమని గెలుచుకున్నాడా? లేదా? అన్నదే అసలు కథ
ప్లస్ పాయింట్స్:.
హీరో ఆది మొదటి సారి ఫుల్ లేన్త్ మాస్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.అక్కడక్కడ కొన్ని సన్నివేశాలలో డైలాగ్స్ తో అలరించాడు.విలన్ పాత్ర లో నటించిన కబీర్ దుహన్ సింగ్ ఈ సినిమాకి ప్లుస్స్ పాయింట్ అయ్యాడు.నరేష్,తనికెళ్ళ భరణి కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.కమెడియన్ శకలక శంకర్,మధు ల మధ్య కామెడీ కూడా పర్వాలేదనిపించింది.
మైనస్ పాయింట్స్:
వాస్తవంగా ఈ సినిమాకి మైనస్ హీరోయిన్ ఆదా శర్మ అనే చెప్పాలి.కథ అంత తన చుట్టూ తిరుగుతున్నా తను మాత్రం సరైన అభినయం ప్రదర్శించ లేక పోయింది.గ్లామర్ పరంగా ఒకే కాని అభినయం మాత్రం సున్నా అని చెప్పాలి.బ్రహ్మానందం,పోసాని,పృథ్వి, తాగుబోతు రమేష్,నవ్వించడం లో విఫలమయ్యారు.రొటీన్ సినిమా కథ అవ్వడం కూడా పెద్ద మైనస్ అని చెప్పొచు
విశ్లేషణ:. ఇక సినిమాలో ఎడిటింగ్ తో పాటు పాటలు, స్లో నేరేషన్ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. సినిమా ఎంట్రీలో కాస్త కామెడీ ఉన్న ఆ తర్వాత ఏదైనా జోక్ వస్తే నవ్వుకుందామని ఎదురుచూసిన ప్రేక్షకులు ఆ కోరిక తీరకుండానే సినిమా పూర్తయి బయటికి వస్తారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు ‘గరం’ గరంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో మాత్రం మొదటి రోజే చల్లబడింది.