ఆధ్యాత్మిక వేత్త గరికపాటి నరసింహరావు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. వ్యంగ్యం జోడించి ఆయన చెప్పే ప్రవచనాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టీవీలో ఆయన కార్యక్రమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇంత ఫేమస్ ప్రవచకుడు నోటివెంట సాయి పల్లవి మాట రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతే కాకుండా ఆయన సాయి పల్లవిని పొగడ్తలో ముంచేశారు. ఓ వేదిక సాక్షిగా గరికపాటి తనకు ఈ తరం హీరోయిన్స్ లో సాయి పల్లవి అంటే ఇష్టం అన్నారు.
ఆమె సినిమాలలో హీరోయిన్స్ ధరించే బట్టల గురించి చేసిన కామెంట్స్ ఆయనకు బాగా నచ్చాయట. అందుకే ఆమె నమస్కారం అని ఆయన చెప్పడం విశేషం. సాయి పల్లవి ఓ సంధర్భంలో నేను పొట్టి బట్టలు ధరించను. దానికి కారణం నా పేరెంట్స్ సినిమా చూసేటప్పుడు ఇబ్బందిగా ఫీలవ్వ కూడదు. అలాగే భవిష్యత్ లో నా పిల్లలు కూడా నా మూవీస్ చూసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. అందుకే నేను పొట్టిబట్టలు ధరించను.
ఇక అలాంటి ఆఫర్స్ తో ఎవరు వచ్చినా అంగీకరించను అన్నారు. ఈ మాటలు గరికపాటి వారికి తెగనచ్చాయట. ఆమె పెట్టుకున్న నియమాలకు నమస్కారం అని ఆయన చెప్పారు. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో లవ్ స్టోరీ, విరాట పర్వం చిత్రాలలో నటిస్తుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది.