Bigg Boss 7 Telugu: డాక్టర్ గౌతమ్ ప్రిన్స్ యవార్ ని అంతమాట అన్నాడా ? అందుకే ప్రిన్స్ ఏడ్చాడా ?

బిగ్ బాస్ హౌస్ లో బిగ్ ఫైట్ అయ్యింది. గౌతమ్ కి ప్రిన్స్ యావార్ కి మద్యలో పెద్ద యుద్ధమే జరిగింది. గట్టి గట్టిగా రంకెలు వేసుకుంటూ ఇద్దరూ కూడా పోట్లగిత్తల్లా పోట్లాడుకున్నారు. ప్రిన్స్ యావార్ అయితే మద్యలో గౌతమ్ చేసిన సైగలకి ఊగిపోయాడు. తన బాడీని చూపిస్తూ గౌతమ్ పైకి దేఖో.. దేఖో అని వెళ్లి అరుస్తున్న ప్రిన్స్ ని చూసి ఇంజక్షన్స్ తీస్కుంటున్నావా అంటూ చేతికి సింబల్ చూపిస్తూ గౌతమ్ మాట్లాడాడు.

దీనికి నువ్వు కొనిస్తున్నావా అంటూ గౌతమ్ పై విరుచుకుని పడ్డాడు ప్రిన్స్. ఇద్దరి మద్యలో మాటలు బాగా పెరిగాయి. ఇది పర్సనల్ గా నన్ను కామెంట్ చేస్తున్నాడు అంటూ ప్రిన్స్ ఏడుస్తూ బిగ్ బాస్ కి మొరపెట్టుకున్నాడు. నాకు జస్టిస్ కావాలి అంటూ రెచ్చిపోయి అరిచాడు. నిజానికి చాలామంది ప్రిన్స్ ని గౌతమ్ ఎలిమినేట్ చేసినందుకే ఇలా రియాక్ట్ అయ్యారని అనుకున్నారు. కానీ, తనని ఇంజక్షన్స్ తీస్కుంటున్నావా అంటూ గౌతమ్ చేసి సైగలకి ఎక్కువగా బరెస్ట్ అయ్యాడు ప్రిన్స్.

అప్పటి వరకూ మాటలకే పరిమితం అయిన వారి ఆర్గ్యూమెంట్స్ ఒకరినొకరు కొట్టుకునే వరకూ వెళ్లింది. దీంతో ప్రిన్స్ యావార్ ఫ్రస్టేట్ అయిపోయాడు. మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా వీళ్లిద్దరి అరుపులు పట్టించుకోకుండా వాళ్ల లాజిక్స్ వాళ్లు వర్కౌట్స్ చేస్తున్నారు. నిజానికి ప్రిన్స్ రతిక చెప్పిన పాయింట్స్ కి ఇంకా ట్రిగ్గర్ అయిపోయాడు. మాయాస్త్రం టాస్క్ లో తను లాస్ట్ వరకూ ఉన్నా కూడా తనకి ఛాన్స్ రాలేదు. గౌతమ్ తనని ఎలిమినేట్ చేసేసాడు.

అంతేకాదు, ఆ తర్వాత (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ సందీప్ కి మరొకరిని సెలక్ట్ చేయమని ఛాన్స్ ఇచ్చినా కూడా సందీప్ అమర్ పేరు సజెస్ట్ చేసాడు. దీంతో ప్రిన్స్ యావార్ కి ఇంకా కాలింది. వెల్ ప్లేయిడ్ బ్రదర్ అంటూ సందీప్ కి కూడా కౌంటర్ వేశాడు. ఈ కోపంలో సందీప్ కిచెన్ దగ్గరకి వచ్చి గొడవ డ్డాడు. ఇద్దరూ కాసేపు ఆర్గ్యూమెంట్ చేసుకున్నారు. అక్కడ మేటర్ చపాతీ అయినా కూడా వాళ్ల మనసులో మాత్రం కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.

మరోవైపు రతిక ప్రిన్స్ యావార్ కి దగ్గరవ్వాలని చూస్తోంది. పల్లవి ప్రశాంత్ తో చెడిపోయిన తర్వాత మరోసారి బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ నడిపించాలని చూస్తోంది. మరి ఈవారం ప్రిన్స్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరి మద్యలో ఒక ట్రాక్ నడిచేలాగానే కనిపిస్తోంది. అదీ మేటర్.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus