గతంలో కంటే కూడా ఇప్పుడు పెద్ద నిర్మాణ సంస్థలు పెద్ద సినిమాలు నిర్మించడం లేదు. ఆల్రెడీ ఎవరో తీసిన సినిమాలు.. చూసి నచ్చితే వాటిని తమ బ్రాండ్ ను వాడుకుని రిలీజ్ చేస్తున్నాయి. లేదు అంటే పక్క భాషల్లో రూపొందిన సినిమాలను డబ్బింగ్ చేసి… కమిషన్ బేసిస్ పై రిలీజ్ చేస్తున్నాయి. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి సంస్థలు చేస్తున్నది అదే. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ వారు కూడా ఎక్కువగా చేసేది ఇదే. ఇక పెద్ద సినిమాల సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో ఎలాగూ పెద్ద నిర్మాణ సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి. వీళ్ళని దాటి అయితే ఒక సినిమా బయటకు వెళ్లడం కష్టం.
సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘గీతా డిస్ట్రిబ్యూషన్’ సంస్థ కూడా ఈ మధ్య ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేస్తుంది. గతేడాది చివర్లో ‘యు ఐ’.. ఈ ఏడాది ఆల్రెడీ ‘ఛావా’ వంటి సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. గతవారం ‘మహావతార్ నరసింహ’ సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. ‘హోంబలే ఫిలిమ్స్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ‘గీతా’ సంస్థ లిమిటెడ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉండటం వల్ల ఎక్కువ థియేటర్లు దక్కలేదు. అయినప్పటికీ ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.6 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాని కమిషన్ బేసిస్ పై రిలీజ్ చేయడం వల్ల ‘గీతా’ వారికి లాభాలు ఏమీ మిగలవట. పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా అని భావించి సేఫ్ సైడ్ కి కమిషన్ తీసుకుని రిలీజ్ చేశారు. కాబట్టి వీరికి లాభాల్లో వాటా ఎక్కువ ఉండదు. ‘కాంతార’ విషయంలో కూడా ఇలాంటి తప్పే చేసింది ‘గీతా’ సంస్థ. పోటీగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఉంది కదా అని.. దాన్ని కూడా కమిషన్ బేసిస్ పై రిలీజ్ చేసి.. లాభాల్లో ఎక్కువ వాటా తీసుకోలేకపోయింది.